Home /News /national /

UNVIABLE POPULIST SCHEMES MAY CREATE SRILANKA LIKE SITUATION BUREAUCRATS TO MODI PVN

Unviable schemes : ఆ రాష్ట్రాలు ఇలాగే చేస్తే..భారత్ లో కూడా శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం ఖాయం

ప్రధాని మోదీ (ఫైల్)

ప్రధాని మోదీ (ఫైల్)

Bureaucrats warning : ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదని, ప్రజాకర్షక పథకాలతో ప్రజలను మోసపుచ్చుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంలో సీనియర్‌ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు.

Bureaucrats to Modi :  శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్న వేల భారత్ లోని బ్యూరోక్రాట్లు సంచలన హెచ్చరికలు జారీ చేశారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాల వల్ల దేశం శ్రీలంక సంక్షోభం వైపు ప్రయాణించేలా ఉందని హెచ్చరించారు. శనివారం రాత్రి ప్రధానమంత్రి మోదీ..ఢిల్లీ లోక్ కళ్యాణ్ మార్గ్‌ లోని తన క్యాంపు కార్యాలయంలో అన్ని శాఖల కార్యదర్శులతో నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. పలు పాలనాపరమైన విషయాలపై వారితో మోదీ అధికారుల సూచనలనూ మోదీ సావధానంగా విన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యదర్శులతో ప్రధాని సమావేశమవ్వడం ఇది తొమ్మిదో సారి. ఈ సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ డోభాల్‌, ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబాతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని కీలక అధికారులంతా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదని, ప్రజాకర్షక పథకాలతో ప్రజలను మోసపుచ్చుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంలో సీనియర్‌ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా.. అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఈ ప్రభావం దీర్ఘకాలంలో ఆ రాష్ట్రాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందన్నారు. పథకాలు ఆర్థిక అస్థిరతకు కారణమవుతున్నాయని, ఇలాగే కొనసాగితే శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం భారత్ లో తలెత్తడం తథ్యమని హెచ్చరించారు.

ALSO READ Sri Lanka crisis: కేంద్ర కేబినెట్ రాజీనామా.. ప్రధాని అనూహ్య నిర్ణయం.. ధరలపై ఆగని జనపోరాటం

ఈ సమావేశంలో ప్ర‌ధాని మోడీ మాట్ల‌డూతూ.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అభివృద్ధి కుంటుపడటానికి పేదరికాన్ని సాకుగా చూపుతూ చెప్పే పాత కథలను అధికారులు మానుకోవాలని హితవు పలికారు. భారీ అభివృద్థి పథకాలను అలక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. తమ మంత్రిత్వ శాఖలకు సంబంధం లేని వాటితో సహా ప్రభుత్వ విధానాలలో లొసుగులను సూచించాలని, అభిప్రాయాన్ని తెలియజేయాలని కార్యదర్శులను ప్ర‌ధాని కోరారు. సంబంధిత శాఖల కార్యదర్శులుగా మాత్రమే కాకుండా భారత ప్రభుత్వ కార్యదర్శులుగా వ్యవహరించాలని,ఒకే బృందంగా పని చేయాలని మోడీ అన్నారు. కరోనా సమయంలో కార్యదర్శులు చూపిన టీమ్‌ వర్క్‌ను ఈ సందర్భంగా ప్రధాని ప్ర‌శంసించారు.

మరోవైపు, శ్రీలంక ప్రస్తుతం చరిత్రలో అత్యంత దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఇంధనం, వంటగ్యాస్‌, నిత్యావసరాల కొరత, గంటల తరబడి కరెంటు కోతలతో ప్రజలు వారాల తరబడి ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో అధ్యక్షుడికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటడంతో దేశవ్యాప్త ఎమర్జెన్సీ విధించింది శ్రీలంక ప్రభుత్వం. తాజాగా శ్రీలంక కేబినెట్ మంత్రులందరూ రాజీనామా చేశారు. అధ్యక్షుడు కూడా రాజీనామా చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
Published by:Venkaiah Naidu
First published:

Tags: India, Pm modi, Srilanka

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు