జమ్మూకాశ్మీర్‌ సంగతేంటి? నేడు ఐరాసలో రహస్య చర్చ

జమ్మూకాశ్మీర్‌ సంగతేంటి? నేడు ఐరాసలో రహస్య చర్చ

ప్రతీకాత్మక చిత్రం

Jammu and Kashmir Issue : మన దేశానికి రెండువైపులా ఉన్న పాకిస్థాన్, చైనా... జమ్మూకాశ్మీర్ విషయంలో తెరవెనక పావులు కదుపుతున్నాయి. పైకి సైలెంట్‌గా ఉన్నట్లు కనిపిస్తున్న చైనా... ఎలాగైనా పాకిస్థాన్‌కి మేలు చెయ్యాలని తహతహలాడుతోంది.

  • Share this:
బలమైన,... కుళ్లు, కుతంత్రాల దేశం పక్కన ఉంటే... భారత్ లాంటి దేశాలకు ప్రమాదమే. చైనా విషయంలో మనకు అదే జరుగుతోంది. ఉగ్రవాద మూకల నుంచీ జమ్మూకాశ్మీర్‌ను కాపాడుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతుంటే... ఎట్టి పరిస్థితుల్లో అలా జరగకూడదన్నట్లు చైనా వ్యవహరిస్తోంది. మామూలుగా అయితే... భారత కేంద్ర ప్రభుత్వం తన మాట వినదని తెలిసి... ఐక్యరాజ్యసమితిలో పావులు కదుపుతోంది. జమ్మూకాశ్మీర్‌కి స్వతంత్ర ప్రతిపత్తిని రద్దుచేస్తూ... కేంద్రం తీసుకున్న నిర్ణయంపై ఇవాళ ఐరాస భద్రతా మండలిలో రహస్య చర్చ జరగనుంది. దీనికి కారణం పాకిస్థాన్ చేసిన పనే. కాశ్మీర్‌పై వెంటనే మీటింగ్ పెట్టాలని... పాక్ విదేశాంగ మంత్రి... ఐరాసకు లేఖ రాశారు. వెంటనే చైనా ఆ లేఖను సమర్థించింది. సీక్రెట్‌గా చర్చించాలని కోరింది. పక్కనే ఉన్న రెండు దేశాలూ అడిగేసరికి భద్రతా మండలి సభ్య దేశాలకు చర్చించక తప్పని పరిస్థితి ఏర్పడింది. అందువల్ల ఇవాళ రాత్రి 7.30కి ఈ చర్చ జరుగుతుంది.

కాశ్మీర్‌పై చివరిసారిగా 1971లో ఐరాస చర్చించింది. ఆ తర్వాత ఇక ఈ విషయంపై మాట్లాడేందుకు ఎప్పుడూ, ఎవరూ సాహసించలేదు. అప్పట్లో బంగ్లాదేశ్‌ యుద్ధం జరగడంతో... అప్పటి భద్రతామండలి... కాశ్మీర్ అంశాన్ని చర్చించింది. ఆ టైంలోనే సిమ్లా ఒప్పందం జరిగింది. దాని ప్రకారం... కాశ్మీర్ అనేది భారత్, పాకిస్థాన్ మధ్య... అప్పటి కేంద్ర ప్రభుత్వం ఐక్యరాజ్యసమితికి తెలిపింది. కానీ... 1971కి ముందు... కాశ్మీర్ అంశాన్ని... ఇండియా-పాకిస్థాన్ క్వశ్చన్ అనే విభాగం కింద చర్చించేవాళ్లు. ఇప్పుడు చైనా... అదే విభాగం కింద చర్చించాలంటోంది. అంటే... కాశ్మీర్‌పై 48 ఏళ్ల కిందట ఏ పొజిషన్ ఉందో, ఇప్పుడూ అదే పొజిషన్ ఉండాలన్నది చైనా వాదనగా కనిపిస్తోంది.

కాశ్మీర్ అంశాన్ని గనక భద్రతామండలి చర్చిస్తే... అది భారత్‌కి ఇబ్బందికర పరిణామమే. ఎందుకంటే... భద్రతా మండలి సభ్య దేశాలు... ఈ అంశాన్ని పాకిస్థాన్‌తో చర్చించి సెటిల్ చేసుకోవాలని భారత్‌కు సూచించే అవకాశాలున్నాయి. కానీ... మన కేంద్ర ప్రభుత్వం... కాశ్మీర్‌తో పాకిస్థాన్‌కి ఎలాంటి సంబంధమూ లేదని ఇప్పుడు అంటోంది. పాకిస్థాన్ ఆక్రమించిన కాశ్మీర్‌ని కూడా లాక్కుంటామని మొన్ననే ప్రకటించింది కూడా. ఈ పరిస్థితుల్లో భద్రతా మండలి దేశాలు... కాశ్మీర్ అంశాన్ని రెండు దేశాలకూ అన్వయిస్తే... అది మనకు తలనొప్పి వ్యవహారమే అవుతుంది.

ప్రస్తుతం భద్రతా మండలిలోని చైనా తప్ప... అమెరికా, రష్యా, ఫ్రాన్స్, బ్రిటన్ దేశాలు పాకిస్థాన్‌కి అనుకూలంగా లేవు. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఆ దేశం ఉగ్రవాదులకు ఊతమిస్తోందన్న ఆలోచన ఒకటైతే... పాకిస్థాన్‌తో ఆ దేశాల మధ్య వాణిజ్యం, వ్యాపారం చాలా తక్కువ కావడమే. అదే ఇండియా విషయానికి వస్తే... ఇండియాలో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది, ఉగ్రవాదం లేదు, యుద్ధ కాంక్ష లేదు, పైగా ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ కూడా ఉంది. అందువల్ల ఇండియాకి అనుకూలంగా భద్రతా మండలిలో సభ్య దేశాలు వ్యవహరించే అవకాశాలున్నాయి. ఐతే... భద్రతా మండలి తీసుకునే ఏ నిర్ణయాన్నైనా సభ్య దేశాలన్నీ అంగీకరించాలి. ఒక్క దేశం వ్యతిరేకించినా, ఆ నిర్ణయం అమలు కాదు. ఈ ఛాన్స్‌ని ఉపయోగించుకుంటున్న చైనా... భారత్‌కి వ్యతిరేకంగా పావులు కదుపుతూ... నానా ఇబ్బందులు పెడుతోంది. అయినప్పటికీ... భారత్ వైపే ప్రపంచ దేశాలు ఉంటాయని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు.
First published: