Home /News /national /

UNMARRIED WOMEN NOW IN MEDICAL TERMINATION OF PREGNANCY ACT UMG GH

Unmarried Pregnancy: పెళ్లి కాని మహిళ 24 వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

అవివాహిత మహిళ గర్భం తీయించుకోవచ్చు

అవివాహిత మహిళ గర్భం తీయించుకోవచ్చు

పెళ్లికాకుండా గర్భవతి అయిన ఓ మహిళ విషయంలో కీలక తీర్పు వెలువరించింది భారత అత్యున్నత న్యాయస్థానం. పరస్పర అంగీకారం (Consensual Relationship)తో గర్భం దాల్చిన ఆ మహిళ తన 24 వారాల గర్భాన్ని (Pregnancy) తొలగించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.

ఇంకా చదవండి ...
పెళ్లికాకుండా గర్భవతి అయిన ఓ మహిళ విషయంలో కీలక తీర్పు వెలువరించింది భారత అత్యున్నత న్యాయస్థానం. పరస్పర అంగీకారం (Consensual Relationship)తో గర్భం దాల్చిన ఆ మహిళ తన 24 వారాల గర్భాన్ని (Pregnancy) తొలగించుకోవచ్చని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ (MTP) పరిధిలో పెళ్లి కాని మహిళను కూడా చేర్చొచ్చని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. పరస్పర అంగీకారంతో కొనసాగే సంబంధం కారణంగా వచ్చే గర్భాన్ని 24 వారాల సమయంలోపు తొలగించుకోవడానికి ఒక మహిళను అనుమతించింది.

వివరాల్లోకి వెళితే.. మణిపూర్‌ రాష్ట్రానికి చెందిన ఒక 25 ఏళ్ల మహిళ తన ఇష్టానుసారమే ఒక వ్యక్తితో సహజీవనం చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమె గర్భవతి అయింది. ఇప్పుడు దాదాపు ఐదు నెలల లేదా 24 వారాల కడుపుతో ఉంది. తన కడుపున బిడ్డ పెరుగుతూ ఉంటే ఆందోళన చెందిన ఆమె తన పార్టనర్‌ను పెళ్లి చేసుకోమని అడిగింది కానీ అందుకు అతడు తిరస్కరించాడు. దాంతో పెళ్లికాని తనకు బిడ్డ పుడితే సమాజంలో తలవంపులు తప్పవని మానసిక వేదనతో తల్లడిల్లింది. అనంతరం ఆమె తన ఆవేదనను కోర్టు ముందు వ్యక్త పరిచింది. పెళ్లి కాకుండా ఈ వయసులో తల్లి అయ్యేందుకు తాను సిద్ధంగా కూడా లేనని వివరించింది.

ఇదీ చదవండి: వారెవ్వా.. ఫేస్ బుక్ లో టిక్ టాక్.. ఇక పండగే పండుగ.. ఎప్పటి నుంచి అంటే!


ఆమె కేసును సుప్రీంకోర్టు న్యాయమూర్తులు డివై చంద్రచూడ్, సూర్యకాంత్, ఎఎస్ బోపన్నలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ ధర్మాసనం 2021లో సవరించిన MTP చట్టంలోని నిబంధనలలో సెక్షన్ 3కి వివరణలో “భర్త (Husband)” అనే పదానికి బదులుగా “భాగస్వామి (Partner)” అనే పదం ఉందని గుర్తు చేసింది. ఈ చట్ట సవరణ వివాహ సంబంధాల వల్ల వచ్చే గర్భాలకు మాత్రమే పరిమితం చేయాలని చెప్పడం లేదని, పార్లమెంటు ఈ చట్ట సవరణకు ఆమోదం కూడా తెలిపిందని స్పష్టం చేసింది. "భాగస్వామి" అనే పదాన్ని ఉపయోగించారు కాబట్టి ఈ చట్టం కింద పెళ్లికాని మహిళ కూడా వస్తారని పేర్కొంది. ఈ మహిళ తన పిండాన్ని తొలగించడానికి అనుమతులు ఇవ్వకుండా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఆ ఉత్తర్వులను సవరించాలని సుప్రీం కోర్టు కోరింది.



MTP చట్టంలోని నిబంధనల ప్రకారం, శుక్రవారంలోగా మహిళను పరీక్షించేందుకు ఇద్దరు వైద్యులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఎయిమ్స్ డైరెక్టర్‌ను ఆదేశించింది. గర్భం తీసేస్తే ఆ మహిళ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందా లేదా అనే విషయాన్ని నిర్ధారించాలని బోర్డును కోరింది. ప్రక్రియ జరిగిన ఒక వారంలోపు మెడికల్ బోర్డు నివేదికను కోరింది. చట్టంలోని నిబంధనల వివరణపై అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి సహాయాన్ని కోరిన ధర్మాసనం, మహిళ తన అవాంఛిత గర్భాన్ని మోసే ఎలా తీర్పు ఇవ్వటం చట్టం ముఖ్య ఉద్దేశ్యం, స్ఫూర్తికి విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్ అవివాహిత మహిళ అనే కారణంతో 20 వారాల తర్వాత అబార్షన్ చట్టం ప్రకారం గర్భాన్ని తొలగించడం విరుద్ధం అని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. కానీ సుప్రీం కోర్టు చట్ట ప్రకారమే తీర్పు ఇచ్చి ఆ మహిళకు ఊరట కలిగించింది.
Published by:Mahesh
First published:

Tags: Delhi High Court, Pregnancy, Pregnant women, Supreme Court

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు