హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Abortions: పెళ్లికాని వారు కూడా అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..

Abortions: పెళ్లికాని వారు కూడా అబార్షన్ చేయించుకోవచ్చు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..

సుప్రీంకోర్టు

సుప్రీంకోర్టు

Abortions: మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం (MTP Act) ప్రకారం.. పెళ్లయిన మహిళ మాదిరిగానే అవివాహిత మహిళకు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. వివాహితులు, అవివాహితులనే భేదం ఉండకూడదని తెలిపింది.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  అబార్షన్‌ల (Abortions)పై సుప్రీంకోర్టు (Supreme Court) చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. సురక్షితమై, చట్టమైన అబార్షన్‌లకు మహిళలందరూ అర్హులేనని స్పష్టం చేసింది. వివాహితులు, అవివాహితులనే భేదం ఉండకూడదని తెలిపింది. మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం (MTP Act) ప్రకారం.. పెళ్లయిన మహిళ మాదిరిగానే అవివాహిత మహిళకు కూడా అబార్షన్ చేసుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. పెళ్లి కాలేదన్న కారణంతో అబార్షన్‌ను అడ్డుకోలేమని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. మహిళలు తమకు ప్రెగ్నెన్సీ ఇష్టం లేకుంటే.. గర్భం దాల్చిన 24 వారాల లోపు అబార్షన్ చేయించుకోవచ్చని తెలిపింది. జస్టిస్ డీవై చంద్రచూడ్, జేబీ పర్దివాలా, ఏఎస్ బోపన్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది.

  Congress: దిగ్విజయ్ వర్సెస్ శశిథరూర్..రసవత్తరంగా అధ్యక్ష ఎన్నికలు..సోనియా మద్దతు ఎవరి

  అవివాహితకు ఇష్టం లేకున్నా.. ప్రెగ్నెన్సీని కొనసాగించాలని చెప్పే అధికారం ఎవరికీ లేదని.. ఇది MTP (మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ) చట్టానికి విరుద్ధమని స్పష్టం చేసింది. 2021 సవరణ తర్వాత మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టంలోని సెక్షన్-3లో భర్తకు బదులుగా భాగస్వామి అనే పదాన్ని ఉపయోగించారని జస్టిస్ డీవై చంద్రచూడ్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఇది పెళ్లికాని మహిళలకు కూడా వర్తిస్తుందన్న ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు. చట్టాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవని..సామాజిక వాస్తవాలను అనుగుణంగా మారుతుంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

  జూలై 16న మణిపూర్‌కు చెందిన ఓ మహిళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. తన 23 వారాల గర్భాన్ని తొలగించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. తాను అవివాహిత మహిళ కావడం, తన భాగస్వామి పెళ్లికి నిరాకరించడం వల్ల బిడ్డకు జన్మనివ్వలేనని ఆ మహిళ తన పిటిషన్‌లో పేర్కొంది. అవివాహిత బిడ్డకు జన్మనిస్తే బహిష్కరణతో పాటు మానసిక వేదన కూడా కలుగుతుందని తెలిపింది. ఐతే ఇది నిబంధనలను విరుద్ధమన్న ఢిల్లీ హైకోర్టు.. పిటిషన్‌ను తిరస్కరించింది. ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ.. సదరు మహిళ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. ఆ పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది.

  అంతేకాదు పెళ్లైన మహిళలతో  భర్తల బలవంతపు శృంగారాన్ని కూడా అత్యాచారంగా భావించాల‌ని సుప్రీంకోర్టు అభిప్రాయ‌ప‌డింది. లైంగిక వేధింపులు, అత్యాచారం నుంచి బయటపడిన వారిలో వివాహిత స్త్రీలు కూడా ఉండొచ్చ‌ని తెలిపింది. ఒక స్త్రీ తన భర్తతో ఏకాభిప్రాయం లేని శృంగారం ఫ‌లితంగా గర్భవతి కావచ్చని.. వారు కూడా అబార్షన్ చేయించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు పేర్కొంది.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Abortions, Supreme Court

  ఉత్తమ కథలు