Home /News /national /

పెళ్లి కాని అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్‌తో శారీరక సంబంధం పెట్టుకునేది అందుకే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

పెళ్లి కాని అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్‌తో శారీరక సంబంధం పెట్టుకునేది అందుకే.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

పెళ్లి కాని యువతీ, యువకుల శారీరక సంబంధాలపై మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ బాలికలెవరూ సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మకంగా చెబితే తప్ప, ఇలాంటి వాటికి అస్సలు అంగీకరించరని స్పష్టం చేసింది.

ఇంకా చదవండి ...
    ఇటీవలి కాలంలో అమ్మాయిలు మోసపోతున్న ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. పెళ్లి పేరుతో ప్రియురాలిని శారీరంగా అనుభవించి, ఆ తర్వాత మోసం చేస్తున్నారు కొందరు ప్రబుద్ధులు. ఏళ్ల తరబడి ప్రేమాయణం సాగించి.. పెళ్లి పేరెత్తగానే ముఖం చాటేస్తున్నారు. ఇంట్లో పెద్దలు ఒప్పుకోవడం లేదనే సాకుతో తప్పించుకుంటున్నారు. ఇలాంటి ఓ కేసు విషయంలో మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భారతీయ బాలికలెవరూ సరదా కోసం శారీరక సంబంధం పెట్టుకోరని వ్యాఖ్యానించింది. పెళ్లి చేసుకుంటానని ప్రియుడు నమ్మకంగా చెబితే తప్ప, ఇలాంటి వాటికి అస్సలు అంగీకరించరని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకుంటానన ఆశజూపి.. ఆమెతో అలాంటి సంబంధం పెట్టుకోవాలని భావించే పురుషులెవరైనా పర్యవసానాలను కూడా గమనించాలని తెగేసి చెప్పింది.

    ఉజ్జయినికి చెందిన ఓ వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ మహిళతో సహజీవనం చేశాడు. కాబోయే భర్తే కదా.. అని అతడికి శారీరకంగా దగ్గరయింది బాధితురాలు. అలా మూడేళ్ల ప్రేమాయణం తర్వాత.. పెళ్లి గురించి ప్రియుడితో ప్రస్తావించింది. కానీ అతడు పెళ్లికి ఒప్పుకోలేదు. వేరొక మహిళతో పెళ్లి సంబంధం కుదరిందని చెప్పాడు. ఆ మాట వినగానే ఆమె గుండె బద్ధలయింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశావంటూ కన్నీరు పెట్టుకుంది. తన జీవితాన్ని నాశనం చేయవద్దని వేడుకుంది. ఐనా అతడు కనికరించలేదు. చివరకు దిక్కుతోచని స్థితిలో ఈ ఏడాది జూన్‌లో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడింది. అనంతరం బాధితురాలితో పాటు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రేప్ కేసు నమోదు చేశారు. ఆమె ప్రియుడిని అరెస్ట్ చేశారు. వీరి వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది.

    ఐతే ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా ఆమె ప్రియుడు మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశాడు. దానిపై ఇండోర్ బెంచ్‌కు చెందిన జస్టిస్ సుబోధ్ అభయంకర్ విచారణ జరిపారు. ఆమె వయసు 21 ఏళ్లు నిండాయని.. ఇరువురి అంగీకారంతోనే శారీరక సంబంధం పెట్టుకున్నామని అతడు వాదించాడు. తాను ఎక్కడా మోసం చేయలేదని చెప్పాడు. ఐతే అతడి వాదనను కోర్టు అంగీకరించలేదు. భారతీయ అమ్మాయిలెవరూ సరదా కోసం శారీరక సంబంధాలు పెట్టుకోరని.. పెళ్లి చేసుకుంటానని నమ్మకంగా చెబితే తప్ప అలాంటి వారికి అంగీకరించరని స్పష్టం చేశారు. నిజాన్ని నిరూపించడానికి ప్రతిసారి బాధితులు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. అనంతరం అతడి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: High Court, Madhya pradesh

    తదుపరి వార్తలు