హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Unlock 4.0: మెట్రో సర్వీసులు.. స్కూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం

Unlock 4.0: మెట్రో సర్వీసులు.. స్కూళ్లపై కేంద్రం కీలక నిర్ణయం

UnLock 4 guidelines  | మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4 గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్ లైన్, దూరవిద్య తరగతులు నిర్వహించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

UnLock 4 guidelines | మరోవైపు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన అన్ లాక్ 4 గైడ్ లైన్స్ నిబంధనల ప్రకారం సెప్టెంబర్ 30 వరకు అన్ని స్కూళ్లు, కాలేజీలు, విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసి ఉంటాయి. ఆన్ లైన్, దూరవిద్య తరగతులు నిర్వహించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ప్రస్తుతం కరోనా కేసులు పెరిగినా.. రికవరీ రేటు కూడా పెరగడంతో.. మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.

మరో వారం రోజుల్లో అన్‌లాక్ 3.0 ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్‌లాక్ 4.0 గైడ్‌లైన్స్‌ను కేంద్రహోంశాఖ సిద్ధం చేస్తోంది. అన్‌లాక్ 4లో మరిన్ని సడలింపులు ఇవ్వాలని భావిస్తోంది. ఇప్పటికే సినిమా షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం.. సెప్టెంబరు 1 నుంచి మెట్రో సర్వీసులను కూడా పునరుద్ధరించాలని యోచిస్తోంది. మెట్రో రైళ్లకు అనుమతి ఇవ్వవచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఐతే స్కూళ్లకు మాత్ర అనుమతి ఇవ్వడం లేదని తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో కరోనా పతాక స్థాయిలో ఉందని.. ఇలాంటి పరిస్థితుల్లో స్కూళ్లు తెరవడం శ్రేయస్కరం కాదన్న భావనలో ప్రభుత్వం ఉందని సమాచారం.

కరోనా వైరస్ విజృంభించిన తర్వాత మొదటి లాక్‌డౌన్ నుంచి మెట్రో సర్వీసులు నిలిచిపోయాయి. ఢిల్లీ, చెన్నై, ముంబై, హైదరాబాద్ సహా పలు నగరాల్లో మెట్రోలు నడవడం లేదు. ఐతే అన్‌లాక్ 4లో మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వాలని ఇటీవల ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కరోనా ప్రభావంతో ఢిల్లీ మెట్రోకు రూ.1300 కోట్ల నష్టం వాటిల్లింది. మిగతా నగరాల్లోనూ ఇదే పరిస్థితి. ఐతే ప్రస్తుతం కరోనా కేసులు పెరిగినా.. రికవరీ రేటు కూడా పెరగడంతో.. మెట్రో సర్వీసులకు అనుమతి ఇవ్వాలని కేంద్రం యోచిస్తోంది.

భారత్‌లో గడిచిన 24 గంటల్లో 61408 కరోనా పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 31 లక్షలు దాటింది. గత 24 గంటల్లో 836 మంది కరోనాతో చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 57542కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.9 శాతంగా ఉంది. ప్రపంచంలో అది 3.54 శాతంగా ఉంది. గత 24 గంటల్లో ఇండియాలో 57469 మంది రికవరీ అయ్యారు. ఫలితంగా మొత్తం రికవరీల సంఖ్య 2338035కి చేరింది. రికవరీ రేటు ఇప్పుడు 75.3 శాతంగా ఉంది. ప్రపంచ దేశాల్లో అది 68.2 పర్సెంట్ ఉంది. ఇది మంచి పరిణామం. బీహార్‌లో రికవరీ రేటు 80.6 శాతానికి చేరింది. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 710771 ఉన్నాయి.

First published:

Tags: Corona virus, Coronavirus, Lockdown, Lockdown relaxations

ఉత్తమ కథలు