హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Accident: రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు దుర్మరణం

Delhi Accident: రోడ్డుపక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన ట్రక్కు.. నలుగురు దుర్మరణం

Delhi Road Accident: రాత్రి సమయంలో ఆరుగురు వ్యక్తులు రోడ్డు డివైడర్‌పై ఖాళీ ప్రాంతంలో పడుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ ట్రక్కు దూసుకొచ్చింది. నిద్రపోతున్న వారిపైకి వెళ్లింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంకొరు చనిపోయారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  దేశ రాజధాని ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం (Delhi Road Accident) జరిగింది. మంగళవారం అర్ధరాత్రి ఓ ట్రక్కు బీభత్సం (Truck Accident in Delhi) సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పి.. రోడ్డు పక్కన నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. సీమాపూరిలోని డీటీసీ డిపో రెడ్‌లైట్ సమీపంలో రాత్రి రెండున్నర గంటల సమయంలో ఈ ఘటన జరిగింది.

  రాత్రి సమయంలో ఆరుగురు వ్యక్తులు రోడ్డు డివైడర్‌పై ఖాళీ ప్రాంతంలో పడుకున్నారు. గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఓ ట్రక్కు దూసుకొచ్చింది. నిద్రపోతున్న వారిపైకి వెళ్లింది. ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోగా.. ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు మరణించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇంకొరు చనిపోయారు. మృతులను 52 ఏళ్ల కరీం, ఛోటే ఖాన్ (25), షా ఆలమ్ (38), రాహుల్ (45)గా గుర్తించారు. 16 ఏళ్ల మనీష్, 30 ఏళ్ల ప్రదీప్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వీరిద్దరికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఐతే ప్రమాదం తర్వాత.. ట్రక్కు అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ట్రక్కును గుర్తించేందుకు పలు బృందాలను ఏర్పాటు చేశారు. ఘటనా స్థలం చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ట్రక్కు డ్రైవర్‌ని పట్టుకొని.. అతడికి కఠిన శిక్షపడేలా చూస్తామని తెలిపారు.

  ఏపీలోనూ ఇవాళ ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లాలో ఓ పేపర్ ప్లేట్ల తయారీ యూనిట్‌లో పెద్ద ఎత్తున మంటలు(Chittoor Fire Accident) చెలరేగాయి. మంటల్లో కాలిపోయి ముగ్గురు వ్యక్తులు మరణించారు. చిత్తూరు (Chittoor)లోని రంగాచారీ వీధిలో రాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. మృతులను భాస్కర్, డిల్లీ బాబు (35), బాలాజీ (25)గా గుర్తించారు. భాస్కర్, డిల్లీబాబు తండ్రీకొడుకులు. నిన్ననే డిల్లీ బాబు పుట్టిన రోజు జరిగింది. అంతలోనే ఊహించని రూపంలో ప్రమాదం ముంచుకొంచి.. ఆయన మరణించారు. తండ్రీపాటు కన్నుమూశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Delhi, New Delhi, Road accident

  ఉత్తమ కథలు