UNIVERSITY SACKS PROFESSOR FOR DEROGATORY REMARKS ON LORD RAM PVN
Professor Sacked : శ్రీరాముడిని కించపర్చేలా మాట్లాడిన ప్రొఫెసర్..చివరికి ఉద్యోగం పోయి రోడ్డున
ప్రతీకాత్మక చిత్రం
Derogatory remarks on Lord Ram : అభ్యంతరకరమైన పదజాలంతో కోట్టాడి మంది ప్రజల ఆరాధ్యమైన శ్రీరాముడిని కించపరిచే విధంగా మాట్లాడింది ఓ ఫ్రొఫెసర్. అయితే శ్రీరాముని(Lord Sri Ram)గురించి ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో చివరకు ఉద్యోగం పోయి రోడ్డున పడింది ఆమె.
Derogatory remarks on Lord Ram : అభ్యంతరకరమైన పదజాలంతో కోట్టాడి మంది ప్రజల ఆరాధ్యమైన శ్రీరాముడిని కించపరిచే విధంగా మాట్లాడింది ఓ ఫ్రొఫెసర్. అయితే శ్రీరాముని(Lord Sri Ram)గురించి ఆమె మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో వైరల్ అయింది. దీంతో చివరకు ఉద్యోగం పోయి రోడ్డున పడింది ఆమె. పంజాబ్(Punjab)రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన గుర్సంగ్ ప్రీత్ కౌర్..లవ్లీ ఫ్రొఫెషనల్ యూనివర్శిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్(Professor)గా పనిచేసేవారు. అయితే గుర్సంగ్ ప్రీత్ కౌర్..శ్రీరాముడి గురించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసిన వీడియో ఒకటి శనివారం సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో గుర్సంగ్ ప్రీత్ కౌర్ ని ఉద్యోగం నుంచి తొలగించాలన్న డిమాండ్లు విద్యార్థుల నుంచి వ్యక్తమయ్యాయి. ఆమెను ఉద్యోగం నుంచి తొలగించకుంటే ధర్నాకు సైతం వెనుకాడేది లేదని విద్యార్తులు చేసిన హెచ్చరికలతో వెంటనే అదే రోజున గుర్సంగ్ ప్రీత్ కౌర్ ని ఉద్యోగం నుంచి తొలగించినట్లు యూనివర్శిటీ వైస్ ప్రెసిడెంట్ అమన్ మిట్టల్ తెలిపారు.
యూనివర్శిటీ విడుదల చేసిన ఓ ప్రకటనలో..." సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వల్ల కొంతమంది బాధపడ్డారని మేము అర్థం చేసుకున్నాము, ఆ వీడియోలో మా ఫ్యాకల్టీ సభ్యులలో ఒకరు ఆమె వ్యక్తిగత అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆమె పంచుకున్న అభిప్రాయాలు పూర్తిగా వ్యక్తిగతమైనవి మరియు విశ్వవిద్యాలయం వాటిలో దేనినీ ఆమోదించదని మేము స్పష్టం చేయాలనుకుంటున్నాము. మేము ఎల్లప్పుడూ లౌకిక(Secular) విశ్వవిద్యాలయంగా ఉన్నాము, ఇక్కడ అన్ని మతాలు మరియు విశ్వాసాల వారిని ప్రేమ మరియు గౌరవంతో సమానంగా చూస్తారు. తక్షణమే ఆమె సేవల నుండి రిలీవ్ చేయబడింది. అయినప్పటికీ, ఈ మొత్తం సంఘటనకు మేము తీవ్రంగా చింతిస్తున్నాము”అని విశ్వవిద్యాలయం తెలిపింది.
Published by:Venkaiah Naidu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.