హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

మహిమాన్విత ఆలయం.. దేవుడి చెవిలో కోరికలు చెప్పుకుంటే.. వెంటనే నెరవేరుతాయట

మహిమాన్విత ఆలయం.. దేవుడి చెవిలో కోరికలు చెప్పుకుంటే.. వెంటనే నెరవేరుతాయట

కాన్ గణేశ్ ఆలయం

కాన్ గణేశ్ ఆలయం

Kan Ganesh Ji Temple: ఇక్కడ ప్రతి వారం జాతర జరుగుతుంది. బుధవారం రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ వేడుకకు హాజరయ్యేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు

  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

మనదేశంలో ఎన్నో పురాతన దేవాలయాలున్నాయి. దాదాపు ప్రతి ఊరిలో ఏదో ఒక దేవుడి గుడి అంటుంది. వాటిలో కొన్ని ఆలయాలు ఎంతో ప్రత్యేకమైనవి. మహిమాన్విత శక్తులు ఉన్నాయని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి ఆలయంలో కాన్ గణేశ్ ఆలయం ఒకటి. ఇది రాజస్థాన్‌ (Rajasthan)లోని బికనీర్‌లో బ్రహ్మసాగర్ ప్రాంతంలో ఉంటుంది. సాధారణంగా కొన్ని ఆలయాల్లో.. గర్భ గుడిలోకి భక్తులను అనుమతించరు. కేవలం అర్చకులు మాత్రమే భగవంతుడికి నిత్య కైంకర్యాలను నిర్వహిస్తారు. కానీ కాన్ గణేశ్ (Kan Ganesh Ji Temple) ఆలయంలో భక్తులను గర్భగుడిలోకి కూడా అనుమతిస్తారు. ఈ ఆలయానికి ఉన్న అతి పెద్ద ప్రత్యేకత ఏమిటంటే.. భక్తులంతా స్వామి వారిని తాకి.. ఆయన చెవిలో తమ కోరికలను చెప్పుకుంటారు. తద్వారా తమకోరికలను నెరవేరుతాయని నమ్ముతారు.

కాన్ గణేశ్ ఆలయం 100 సంవత్సరాలకు పైగా పురాతనమైనది. హిందీలో కాన్ అంటే చెవి అని అర్థం. భక్తులు దేవుడి చెవిలో కోరికలు చెప్పుకోవడం వల్ల.. ఈ ఆలయానికి కాన్ గణేశ్ మందిర్‌గా పేరు వచ్చింది. ఈ ఆలయంలో గణేశుడు బాలుడి రూపంలో కొలువై ఉన్నాడు. కాన్ గణేశ్ ఆలయంలో స్వామి వారి చెవులు ఎంతో ప్రత్యేకమైనవి. ఎందుకంటే.. భక్తుల తమ కోరికలను నేరుగా దేవుడితో చెబుతారట. విగ్రహం వద్దకి వెళ్లి.. దేవుడి చెవిలో తమ కోరికలను వివరిస్తారు. వాటిని గణేశుడు కూడా వింటాడని భక్తులు విశ్వసిస్తారు. కాన్ గణేశ్ ఆలయంలో వినాయకుడి విగ్రహం ఎర్రరాతితో నిర్మితమైంది. స్వామి వారి తొండం ఎడమ వైపునకు ఉంటుంది. నాలుగు చేతులు కలిగి ఉండి.. పెళ్లి కొడుకు రూపంలో కూర్చొని ఉంటాడు. ఈ టెంపుల్‌లో వినాయకుడి విగ్రహంతో పాటు సూర్యచంద్రుబు, మూషిక విగ్రహాలు కూడా ఉన్నాయి.

ఇక్కడ ప్రతి వారం జాతర జరుగుతుంది. బుధవారం రోజున ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఆ వేడుకకు హాజరయ్యేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఈ కాన్ ఆలయంలో వినాయకుడిని దర్శించుకోవడం ద్వారా అనేక దోషాలు తొలగిపోతాయని ఆలయ పూజారి శ్యామ్ గెహ్లాట్ తెలిపారు. జాతకంలో సూర్యచంద్రులు, రాహుకేతువుల దోషాలు ఉన్న వారు.. ఇక్కడ వినాయకుడిని దర్శించుకుంటే.. ఆ దోషాలు తొలగిపోతాయట. అంతేకాదు కాన్ గణేశ్ ఆలయంలో 21 రోజుల పాటు21 ప్రదక్షిణలు చేయడం ద్వారా అనేక దోషాల నుండి విముక్తి పొందుతారట. భక్తులు కోరిన కోరికలను నెరవేరుతాయి

First published:

Tags: Rajasthan, Temple

ఉత్తమ కథలు