Home /News /national /

UNIQUE SHOPS OF INDIA MIZORAM SHOPS WITHOUT SHOPKEEPERS YOU CAN PICK YOURSELF WHAT EVER ITEM YOU WANT SK

రోడ్డు పక్కనే దుకాణాలు.. కానీ ఎవరూ ఉండరు.. ఒక్క దొంగతనం కూడా జరగలేదు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రోడ్డుపక్కన ఈ చిన్న చిన్న దుకాణాలను నడిపే వారు.. పేద రైతులు. తమ పొలాల్లో పండిన కూరగాయలు, పళ్లనే ఇక్కడ విక్రయిస్తుంటారు. వీరు వ్యవసాయం పైనే ఎక్కువగా ఆధారపడతారు. అందువల్ల వ్యవసాయ పనులను మానుకోని.. దుకాణాల్లో ఉండడం కుదరదు.

    ఎంత మంది సెక్యూరిటీ ఉన్నా.. సీసీ కెమెరాలు ఉన్నా.. షాపింగ్ మాల్స్‌లో  దొంగతనాలు జరగడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. దుకాణాల్లో యజమానులను మాటల్లో పెట్టి.. వస్తువులను కొట్టేసిన ఘటనల గురించి టీవీలు, పేపర్లలో చూశాం. కానీ మనదేశంలో ఓ విచిత్రమైన ప్రాంతం ఉంది. అక్కడ షాపుల్లో ఎవరూ ఉండరు. వస్తువులు మాత్రం ఉంటాయి. వాటికి రేట్లు రాసి ఉంటాయి. మీకు కావాల్సిన వస్తువులను మీరే తీసుకొని.. డబ్బులను అక్కడున్న గల్ల పెట్టెల్లో వేయాల్సి ఉంటుంది. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే రకం మనుషులు మన చుట్టూ చాలానే ఉంటారు. అలాంటిది రోడు పక్కన కొట్లు ఉండి.. అందులో ఎవరూ లేకుంటే.. ఊరుకుంటారా? అందిన కాడికి వస్తువులను ఎత్తుకెళ్తారు. గల్ల పెట్టెల్లో ఉన్న డబ్బునూ దోచుకెళ్తారు. కానీ మిజోరాం (Mizoram)లో మాత్రం అలా జరగదు. అక్కడి ప్రజలు చాలా నిజాయతీగా ఉంటారు. కావాల్సిన వస్తువులను తీసుకొని.. వాటి డబ్బులను గల్లా పెట్టెల్లో వేస్తుంటారు.

     Kshama Bindu: అప్పుడు వరుడు లేకుండా పెళ్లి.. ఇప్పుడు సింగిల్‌గానే గోవాకు హనీమూన్

    మిజోరాం రాజధాని ఐజ్వాల్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో సెయిలింగ్ అనే చిన్న పట్టణం ఉంది. ఈ నగరం యొక్క ప్రత్యేకత ఏమిటంటే.. అక్కడ ఇక్కడ "Nghah Lou Dawr కల్చర్" అనే పేరుతో ఇప్పటికీ ఓ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. సెయిలింగ్ పట్టణంతో పాటు హైవేలో రోడ్డుపక్కన చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి. వాటిలో కూరగాయలు, పండ్లు, చేపలు ఇతర నిత్యావసరాలను విక్రయిస్తారు. ఐతే ఆ వస్తువులను అమ్మేందుకు షాప్‌లో ఎవరూ ఉండరు. కేవలం వస్తువులు మాత్రమే ఉంటాయి. పక్కనే వాటి రేటు రాసి ఉంటుంది. అక్కడి ఎవరైనా వెళ్లొచ్చు. నచ్చిన వస్తువును తీసుకొచ్చు. వాటికైన డబ్బులను గల్లా పెట్టెల్లో వేస్తారు.

    Unmarried Pregnancy: పెళ్లి కాని మహిళ 24 వారాల గర్భాన్ని తొలగించుకోవచ్చు.. సుప్రీం కోర్టు సంచలన తీర్పు

    దుకాణదారుడు లేని ఈ దుకాణాలపై తరచుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లోని ప్రాంతాలను చూసేందుకు వెళ్లే పర్యాటకులు.. ఈ షాపులను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇక్కడి ప్రజలు నిజంగా చాలా గ్రేట్ అని అభిప్రాయపడుతున్నారు. కేవలం విశ్వాసం ఆధారంగా దుకాణాలు నడపడం చిన్న విషయం కాదని.. అక్కడి ప్రజల్లో ఒకరి పట్ల మరొకరికి నమ్మకం ఎక్కువని చెబుతున్నారు.



    రోడ్డుపక్కన ఈ చిన్న చిన్న దుకాణాలను నడిపే వారు.. పేద రైతులు. తమ పొలాల్లో పండిన కూరగాయలు, పళ్లనే ఇక్కడ విక్రయిస్తుంటారు. వీరు వ్యవసాయం పైనే ఎక్కువగా ఆధారపడతారు. అందువల్ల వ్యవసాయ పనులను మానుకోని.. దుకాణాల్లో ఉండడం కుదరదు. అంత సమయం వారికి ఉండదు. అందుకే షాపుల్లో కూరగాయలు, పండ్లను పెట్టేసి.. డబ్బుల కోసం ఓ డబ్బా లేదంటే సంచిని పెట్టేసి.. తిరిగి వ్యవసాయ పనులకు వెళ్తుంటారు. ఐతే ఆ షాపుల్లో ఇప్పటి వరకు ఒక్క దొంగతనం కూడా జరగలేదని స్థానికులు చెబుతున్నారు. నేటి కాలంలో దొంగల భయంతో ప్రజలు తమ ఇళ్లలోనే సీసీటీవీని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ వీరు మాత్రం తమ దుకాణాలను అలానే వదిలేసి తమ పనులను తాము చేసుకుంటున్నారు. ఇలాంటి నిజాయితీ కలిగిన ప్రజలు అంతటా ఉంటే.. ఎంత బాగుంటుందో కదా..!
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Mizoram, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు