Unique origin story of bihar brothers : ప్రపంచ వింతలలో ఒకటైన తాజ్ మహల్ మనదేశంలోనే ఉందని అందరికీ తెలిసిందే. అయితే ప్రపంచ అగ్రరాజ్యాలకు నిలయమైన ఒక ఊరు కూడా మనదేశంలోనే ఉందని ఎంతమందికి తెలుసు. అగ్రరాజ్యాలకు నిలమైన ఊరు ఏంటిదని ఆశ్చర్చపోతున్నారా?అవును బీహార్ లో పశ్చిమ చంపారన్ జిల్లాలోని జమాదర్ తోలా గ్రామానికి వెళితే ఎవరికైనా ఇలాంటి ఆశ్చర్యమే ఎదురవుతుంది. జమాదర్ తోలా గ్రామానికి చెందిన అకుల్ శర్మ..రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇండియన్ ఆర్మీలో చేరారు. ఆర్మీలో ఉన్న సమయంలోఅకుల్ శర్మ గాయపడ్డారు. శత్రువుల తూటాలు ఆయన భుజంలోకి దిగాయి. ఇంటికి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకుంటున్న సమయంలోనే ఆయన సోదరునికి కొడుకు పుట్టాడు.
అయితే పుట్టిన కుమారునికి అమెరికా పేరు పట్టాల్సిందిగా అకుల్ కోరారు. ఆయన కోరిక మేరకు పుట్టిన కుమారునికి అమెరికా అనే పేరు పెట్టారు. ఆ తర్వాత పుట్టిన వారికి కూడా అదే క్రమంలోనే ఆఫ్రికా, జర్మనీ, రష్యా, జపాన్ లుగా నామకరణం చేశారు. ఆ సమయంలోనే వారి పేర్లు చర్చనీయాంశాలయ్యాయి. 2012లో రష్యా శర్మ మృతి చెందగా,2017లో జర్మనీ శర్మ మరణించారు.
ALSO READ GST Collections : జీఎస్టీ వసూళ్లలో కొత్త రికార్డు
తమ కుటుంబంలో అందరం కమ్మరి వృత్తి చేసేవారమని,. ఐదుగురం అన్నదమ్ములం ఎంతో ప్రేమగా బతికేవారమని చెప్పారు. ఎప్పుడైనా చిన్న గొడవలు వచ్చినప్పటికీ చర్చలతో పరిష్కరించుకునేవారమని, వారి మరణం తర్వాత మిగిలిన ముగ్గురం ఎంతో ప్రేమగా బతుకుతున్నామని జపాన్ శర్మ తెలిపారు. అయితే.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వీరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమలాగే సోదరభావంతో ఈ దేశాలు మెలగాలని ఈ అన్నదమ్ములు కోరుకుంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Bihar, Germany, Japan, Russia-Ukraine War