హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Unique Wedding: తన కూతురిని ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదని.. దేవుడితో వివాహం చేసిన తండ్రి

Unique Wedding: తన కూతురిని ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదని.. దేవుడితో వివాహం చేసిన తండ్రి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Unique wedding: దివ్యాంగురాలైన తన కూతురిని ఎవరూ పెళ్లి చేసుకోవడం లేదని ఆ తండ్రి ఎంతో బాధపడిపోయాడు. కూతురు మనో వేదనకు గురవడంతో.. ఆమె ఆనందం కోసం.. ఏకంగా దేవుడితో వివాహం జరిపించాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

మీరు ఎన్నో వివాహాలు చూసి ఉంటారు. హిందువుల సంప్రదాయ ప్రకారం.. వధువు మెడలో వరుడు తాళి కడతాడు. అప్పుడు పెళ్లి జరిగినట్లు అర్ధం చేసుకోవాలి. కానీ ఈ మధ్య ట్రెండ్ మారుతోంది. అమ్మాయిలను అమ్మాయిలు, అబ్బాయిలను అబ్బాయిలు కూడా పెళ్లి చేసుకుంటున్నారు. ఎవరితోనూ సంబంధం లేకుండా.. స్వీయ వివాహం కూడా వచ్చేసింది. అంటే.. తనను తాను పెళ్లి చేసుకోవడమన్న మాట. ఐతే వీటిన్నింటికీ భిన్నమైన వివాహం (Unique) ఒకటి మధ్యప్రదేశ్‌ (Madhya Pradesh)లో జరిగింది. ఓ వ్యాపారవేత్త.. దివ్యాంగురాలైన తన కుమార్తెను.. ఏకంగా దేవుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. తన కూతురిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ఇష్టపడకపోవడంతో.. శ్రీకృష్ణ భగవానుడితో వివాహం జరిపించాడు. గ్వాలియర్‌లో ఈ ప్రత్యేక వివాహం జరిగింది.

గ్వాలియర్ జిల్లాలోని మోహనాకు చెందిన శివపాల్ వృత్తిరీత్యా వ్యాపారవేత్త. ఆయనకు ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు, రెండో కూతురికి ఇప్పటికే వివాహం జరిగింది. మూడో కుమార్తె పేరు సోనాల్. వయసు 26 ఏళ్లు. 21 ఏళ్లుా వీల్ ఛైర్‌కే పరిమితమైన సోనాల్‌..కు చెవులు వినబడవు. మాటలు కూడా రావు. బ్రెయిన్ నర్వ్ డిజార్డర్‌తో బాధపడుతోంది. ఆమెను పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. ఎంత ప్రయత్నించినప్పుటికీ వ్యాధి నయం కాకపోవడంతో.. పెళ్లి జరగలేదు. ఐతే తన తోటి వారంతా పెళ్లి చేసుకొని.. సుఖసంతోషాలతో ఉంటే.. తనకు ఈ గత్తి పట్టిందేంటని ఆమె బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలోనే సోనాల్ ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఏకంగా దేవుడితో పెళ్లి జరిపించాడు. నవంబరు 7న గ్వాలియర్ పట్టణంలో సోనాల్ వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది.

బారాత్‌లో డ్యాన్స్‌ వీడియోకి 30లక్షల వ్యూస్ .. ట్రెండ్ సెట్ చేసిన వీడియో ఇ

సాధారణ పెళ్లిలానే హల్దీ, మాతా పూజ, మెహందీ, బరాత్, రిసెప్షన్ వంటి అన్ని కార్యక్రమాలను నిర్వహించారు. శ్రీకృష్ణుడి వేషధారణలో ఉన్న ఓ యువతి సోనాల్ మెడలో తాళి కట్టింది. బంధువులు, స్థానికులు తరలి వచ్చి ఆమెను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత.. డీజే దరువులతో ఊరేగింపు కార్యక్రమం కూడా జరిగింది. ఆలయం నుంచి తన ఇంటి వరకు ర్యాలీ చేశారు. డప్పు దరువులు, ఆటపాటలు, టపాకాయల మోత మధ్య ఆమెను తిరిగి ఇంటికి తీసుకెళ్లారు. సోనాల్‌కు పెళ్లి జరుగుతుందని తెలిసి.. వారి బంధువులు షాక్ అయ్యారు. ఆమెను పెళ్లి చేసుకునే వరుడు ఎవరా? అని తెలుకునేందుకు ఆసక్తి చూపారు. తీరా మంటపానికి వెళ్లి తర్వాత.. శ్రీకృష్ణ భగవానుడే వరుడు అని తెలిసి ఖంగుతిన్నారు.

ఖర్చుకు ఏ మాత్రం వెనకాడకుండా ఎంతో వైభంగా తన చిన్నకూతురి వివాహం చేశాడు శివపాల్. పెళ్లి తర్వాత.. ఆమె ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. తనకు తోడు ఎవరూ లేరని కుండిపోతూ ఉండేదని.. శ్రీకృష్ణ భగవానుడే ఆమెను చూసుకుంటాడని.. కుటుంబ సభ్యులు నమ్ముతున్నారు. సోనాల్ పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కూతురు సంతోషం కోసం శివపాల్ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు. మీకంటే బెస్ట్ డాడ్ ఇంకెవరూ ఉండరని కామెంట్స్ చేస్తున్నారు.

First published:

Tags: Madhya pradesh, Marriage, Wedding

ఉత్తమ కథలు