రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రధాని మోదీ కోరిక మేరకే..

ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి కోరిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు తక్కువ స్థాయిలో రైళ్లను నడిపేందుకు అనుమతినిస్తున్నాయి.

news18-telugu
Updated: May 10, 2020, 8:52 PM IST
రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ప్రధాని మోదీ కోరిక మేరకే..
పీయుష్ గోయెల్
  • Share this:
రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోని వలస కూలీలందరినీ తరలించేందుకు ప్రధాని మోదీ ఆదేశాల మేరకు రైల్వే శాఖ నిత్యం 300 వరకు శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడిపేందుకు సిద్ధంగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. రాబోయే మూడు నాలుగు రోజుల్లో వలస కార్మికులను స్వస్థలాలకు చేర్చేందుకు అవసరమయ్యే రైళ్లను రైల్వే శాఖ నడపనుంది. ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలని పశ్చిమబెంగాల్ ప్రభుత్వాన్ని కేంద్ర హోంమంత్రి కోరిన సంగతి తెలిసిందే. అయితే రాజస్థాన్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలు తక్కువ స్థాయిలో రైళ్లను నడిపేందుకు అనుమతినిస్తున్నాయి. కూలీలను మూడు నాలుగు రోజుల్లో వారి స్వస్థలాలకు చేర్చేందుకు రాష్ట్రాలన్నీ రైళ్లు నడిపేందుకు అనుమతివ్వాలంటూ ట్విటర్ ద్వారా కోరారు. దాదాపు 20 లక్షల మంది వలస కార్మికులను ఐదు రోజుల్లో వారి స్వస్థలాలకు చేర్చేందుకు రైల్వే శాఖ 300 రైళ్లను నడపనుందని రైల్వే శాఖ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు.
Published by: Narsimha Badhini
First published: May 10, 2020, 8:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading