Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు.. రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు..

ప్రతీకాత్మక చిత్రం

Electric Vehicles: గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది.

  • Share this:
    దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలు ప్రొత్సహించేందుకు కేంద్రం ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించాలని సూచించింది. కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే ఈ మేరకు కేంద్రమంత్రులకు, రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సూచించారు. కేంద్రంలోని తన సహచర మంత్రులతో పాటు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్ లేఖ రాసినట్టు కేంద్ర విద్యుత్ శాఖ తెలిపింది. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ప్రస్తుతం తాము వినియోగిస్తున్న వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారడంతో పాటు తమ పరిధిలోని శాఖల్లో వినియోగించే వాహనాలను కూడా ఎలక్ట్రిక్ వాహనాల్లోకి మారాలని కేంద్రమంత్రి కోరారు. కేంద్రమంత్రులు, ముఖ్యమంత్రులు ఈ రకంగా చేయడం ద్వారా సామాన్య ప్రజలు కూడా పెట్రోల్, డీజిల్ కార్ల నుంచి ఎలక్ట్రిక్ కార్లకు షిఫ్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. గో ఎలక్ట్రిక్ క్యాంపెయిన్‌లో భాగంగా ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలను ప్రొత్సహించేందుకు చర్యలు తీసుకుంటోంది.

    మరోవైపు వాహనదారులు సైతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ఆసక్తి చూపిస్తున్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలు వాడేందుకు ముందుకొస్తున్నారు. ఇక గతంతో పోలిస్తే మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల తాకిడి కూడా బాగా పెరిగింది. పేరున్న కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసేందుకు ముందుకు రావడంతో వినియోగదారులు కూడా వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఎలక్ట్రిక్ వాహనాలు వినియోగం పెరిగేందుకు ప్రొత్సహకాలు ఇస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోళ్లపై రాయితీలు ఇచ్చి వాహనదారులు వాటిపై ఆసక్తి పెంచుకునేలా చేస్తున్నాయి.

    Biting Lips: మీకు పెదాలు కొరికే అలవాటు ఉందా ? చాలా డేంజర్.. ఎందుకంటే..

    ఇక ప్రభుత్వ రంగ సంస్థలైన రాష్ట్రాల ఆర్టీసీలు సైతం ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసేందుకు ముందుకొస్తున్నాయి. ఇందుకోసం కేంద్రం ప్రత్యేకంగా రాయితీలు కూడా ఇస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించి ప్రభుత్వ శాఖల్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడంపై కేంద్రం దృష్టి సారించింది. ముందుగా ప్రభుత్వ శాఖలు వీటిని వినియోగిస్తే.. ఆ తరువాత సామాన్య ప్రజలు కూడా వీటిని కొనుగోలు చేసేందుకు ముందుకొస్తారని కేంద్రం గట్టిగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్రమంత్రులు, రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదాయ ఇంధనంతో వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాలకు మారాలని సూచించింది. మరి కేంద్రం సూచనలు రాష్ట్రాలు ఏ మేరకు పాటిస్తాయో చూడాలి.
    Published by:Kishore Akkaladevi
    First published: