హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Fuel Prices: బాబోయ్.. ఇలా పట్టేసుకుందేంటి? -పెట్రో ధరలపై కేంద్ర మంత్రికి విమానంలోనే చుక్కలు..

Fuel Prices: బాబోయ్.. ఇలా పట్టేసుకుందేంటి? -పెట్రో ధరలపై కేంద్ర మంత్రికి విమానంలోనే చుక్కలు..

ధరలపై మంత్రి ఇరానీకి విమానంలో చేదు అనుభవం

ధరలపై మంత్రి ఇరానీకి విమానంలో చేదు అనుభవం

ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో పెట్రో, ఎల్పీజీ ధరలు కొంచెం పెరిగినా భూమి బద్దలయ్యేలా పోరాటాలు చేసి, నాటి ప్రధాని మన్మోహన్ కు గాజులు పంపిన బీజేపీ ఫైర్ బ్రాండ్ స్మృతి ఇరానీకి అదే ధరల విషయంలో చేదు అనుభవం ఎదురైంది..

దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రోజుకింత చొప్పున కొండలా పెరుగుతున్నాయి. గ్యాస్ బండ ధర ఇప్పటికే రూ.1000దాటేసింది. వేసవిలో ఉపశమనం ఇచ్చే నిమ్మకాయల ధరలు కూడా రూ.400కు చేరాయి. వంటనూనెలు, తిండిగింజలు, కరెంటు బిల్లలు, ఆటో, బస్సు చార్జీల మోత మోగుతోంది. ఒకప్పుడు కాంగ్రెస్ హయాంలో పెట్రో, ఎల్పీజీ ధరలు కొంచెం పెరిగినా భూమి బద్దలయ్యేలా పోరాటాలు చేసిన భారతీయ జనతా పార్టీ ఇవాళ అధికారంలో ఉంటూ జనాలపై భయానకంగా భారం మోపుతున్న వైనం నిత్యం చర్చలోనే ఉంటుంది. సోషల్ మీడియాలో స్కృతి ఇరానీ ఫొటో లేకుండా ధరల పెంపు ప్రస్తావనే ఉండదంటే అతిశయోక్తికాదు. ఒకప్పుడు సర్కారును ప్రశ్నించిన ఆమె.. ఇప్పుడు అధికారంలో ఉండి సమాధానం చెప్పుకోవడానికి లేదా ధరల పెంపును సమర్థించుకోడానికి చుక్కలు చూడాల్సి వచ్చింది. వివరాలివే..

బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లను నేలకు దించుతాం అని నరేంద్ర మోదీ ప్రధాని కాకముందు చెప్పిన మాటలు ఇప్పటికీ వైరలవుతూనే ఉంటాయి. వాటికి సమానంగా స్కృతి ఇరానీ ఆందోళనల ఫొటోలు కూడా ఇప్పటికీ విపరీతంగా షేర్ అవుతుంటాయి. యూపీఏ-2 హయాంలో పెట్రో, ఎల్పీజీ ధరలు పెరిగిన సందర్భంలో బీజేపీ నేత స్మృతి ఇరానీ గ్యాస్ సిలిండర్లతో రోడ్లపై ధర్నా నిర్వహించడం, ఆడవాళ్ల కష్టాలు పెంచిన పాపాత్ముడంటూ నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు గాజులు పంపడంతో ఆమె బీజేపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్ గాంధీని ఓడించి స్కృతి తన బ్రాండ్ వాల్యూ నిలబెట్టుకోగా, పార్టీ ఆమెకు కేంద్ర మంత్రి పదవి కట్టబెట్టింది. సీన్ కట్ చేస్తే, ఇటీవల పెట్రో, గ్యాస్ ధరలు భారీగా పెరుగుతున్న క్రమంలో ప్రత్యర్థి పార్టీల నేతలు తరచూ స్కృతి ఇరానీ నిరసనల ఫొటోలను షేర్ చేస్తూ మోదీ సర్కారుపై విమర్శలు గుప్పిస్తుంటారు. అలాంటిదిప్పుడు నేరుగా ఆమెనే పట్టేసుకుని చెడామడా కడిగేశారు మహిళా కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా. అసలేం జరిగిందంటే..

విమానంలో కేంద్ర మంత్రిని నిలదీస్తున్నా కాంగ్రెస్ నేత నెట్టా

KCR లేని వేళ భద్రాద్రికి తమిళిసై -సీఎం, గవర్నర్ Ram Navami 2022 సందేశాలివే -మళ్లీ ప్రోటోకాల్ రగడ?

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ ఆదివారం నాడు విమానంలో ఢిల్లీ నుంచి గువాహటి(అస్సాం) వెళుతుండగా చేదు అనుభవం చవిచూడాల్సి వచ్చింది. ఆ విమానంలోనే ప్రయాణించిన మహిళా కాంగ్రెస్ చీఫ్ నెట్టా డిసౌజా.. ధరల పెంపుపై కేంద్ర మంత్రిని నిలదీశారు. ఈ క్రమంలో ఇద్దరు మహిళా నేతల మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటుచేసుకుంది. విమానం దిగి బయటికి వస్తున్న సమయంలోనూ వీరు పోటాపోటీగా వీడియోలు తీస్తూ వాదులాడుకున్నారు. నన్ను అనవసరంగా నిందిస్తున్నారంటూ కేంద్ర మంత్రి వాపోవడం వీడియోలో వినిపిస్తుంది.

విమానంలో కేంద్ర మంత్రి ఇరానీ

Shocking: ఉడుముపై అత్యాచారం.. నిందితుల మొబైల్‌ ఫోన్‌లో షాకింగ్ వీడియో.. ముగ్గురి అరెస్ట్

విమానంలో కేంద్ర మంత్రిని చూసిన కాంగ్రెస్ నేత నెట్టా డిసౌజా.. వీడియో ఆన్ చేసి, దగ్గరికెళ్లి ధరల పెంపుపై వివరణ కోరారు. అప్పటికే ప్రయాణికులు ఒక్కొక్కరుగా దిగుతుండటంతో ‘ముందు మీరు పక్కకు తప్పుకోండి.. దానిని బ్లాక్ చేస్తున్నారు’అని కేంద్ర మంత్రి అన్నారు. ‘ధరలు పెరగడంతో పేదలు గ్యాస్ కొనలేకపోతున్నారు’అని కాంగ్రెస్ నేత చెప్పగా.. ‘దయచేసి అబద్దాలు మాట్లాడకండి.. మీ తీరు సరిగా లేదు’అని మంత్రి బదులిచ్చారు. విమానం దిగిన తర్వాతా వెంటాడుతోన్న కాంగ్రెస్ నేతను ఉద్దేశించి ‘ఏంటి మీరు.. ధరల గురించి మాట్లాడేదేంటి? ప్రజలకు ఉచితంగా రేషన్ సరుకులు అందిస్తున్నా, వ్యాక్సిన్లు వేయిస్తున్నాం.. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అది చూడరా?’అని స్మృతి ఇరానీ ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానంలో కేంద్ర మంత్రితో అనుచితంగా ప్రవర్తించిన ఆరోపణల కింద మహిళా కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

First published:

Tags: Bjp, Congress, Diesel price, Fuel prices, Lpg Cylinder Price, Petrol Price, Smriti Irani

ఉత్తమ కథలు