ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి... ఎస్పీ నేతలకు స్మృతీ ఇరానీ ఘాటు కౌంటర్...

Lok Sabha Election 2019 : ఈసారి ఎన్నికల్లో జయప్రదపై ఎస్పీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెను గెలుపువైపు నడిపిస్తాయంటున్నారు విశ్లేషకులు.

Krishna Kumar N | news18-telugu
Updated: April 15, 2019, 2:46 PM IST
ముందు మహిళల్ని గౌరవించడం నేర్చుకోండి... ఎస్పీ నేతలకు స్మృతీ ఇరానీ ఘాటు కౌంటర్...
Lok Sabha Election 2019 : ఈసారి ఎన్నికల్లో జయప్రదపై ఎస్పీ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆమెను గెలుపువైపు నడిపిస్తాయంటున్నారు విశ్లేషకులు.
  • Share this:
బీజేపీ అభ్యర్థి జయప్రదపై... సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్‌ చేసిన వ్యాఖ్యలపై రాజకీయంగా తీవ్ర దుమారం రేగుతోంది. ప్రముఖ నేతలంతా ఆ వ్యాఖ్యల్ని ఖండిస్తున్నారు. దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ... తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళలపై పిచ్చి ప్రేలాపనలు వాగుతుంటే... సమాజ్ వాదీ పార్టీ నేతలు సైలెంట్‌గా ఎందుకుంటున్నారని ఆమె ప్రశ్నించారు. రాజకీయాలు వేరు... వ్యక్తిగత విమర్శలు వేరన్న ఆమె... ఎవరైనా సరే... మహిళల్ని గౌరవించాలని కోరారు. అది మానేసి ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడం వల్ల ఎలాంటి రాజకీయ ప్రయోజనాలూ ఉండకపోగా... అందరూ వ్యాఖ్యలు చేసిన వారినే తప్పుపడతారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు స్మృతీ ఇరానీ.

ఈమధ్యే బీజేపీలో చేరిన జయప్రద... ఆ పార్టీ టికెట్‌పై రాంపూర్‌ లోక్‌సభ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి అజంఖాన్ కూడా పోటీ చేస్తుండడంతో ఇద్దరి మధ్యా తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. అజాంఖాన్‌తో పాటు జయప్రద కూడా ఇదివరకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)లో కొనసాగారు. 2004లో ఎస్పీ టికెట్‌పైనే రాంపూర్‌ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు.


రాంపూర్‌ ఎన్నికల ప్రచారంలో అజంఖాన్ మాట్లాడుతూ.. ‘‘జయప్రదను రాంపూర్ తీసుకొచ్చింది తానేననీ.... ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని గుర్తించలేకపోయాననీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక మహిళ అని కూడా చూడకుండా ఇంత అనుచితంగా ఎలా మాట్లాడతారంటూ ఆయనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాను చనిపోతేనో అజంఖాన్ కళ్లు చల్లబడతాయన్న జయప్రద... ఎట్టి పరిస్థితుల్లో రాంపూర్ వదలనని తెగేసి చెప్పారు.ఇవి కూడా చదవండి :

చిన్నారి కోసం రూ.2.18 కోట్లు విరాళం... మానవత్వం ఇంకా ఉందని నిరూపించుకున్నారుగా...

వాళ్ల సంతోషం కోసం నేను... బాడీ షేమింగ్‌పై విద్యా బాలన్ ఏం చెప్పిందంటే...

110-140 స్థానాల్లో టీడీపీ గెలుస్తుంది... ఏపీ ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు తాజా విశ్లేషణ...

ఎన్నికల ఫలితాలపై... టీడీపీ వ్యూహం ఏంటి... వైసీపీ ఏం చేయబోతోంది...
Published by: Krishna Kumar N
First published: April 15, 2019, 2:46 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading