చైనా ఫుడ్‌ను బహిష్కరించాలన్న కేంద్రమంత్రి

చైనీస్ వంటకాలను విక్రయించే రెస్టారెంట్లను బహిష్కరించాలని కేంద్రమంత్రి రాందాస్ అన్నారు.

news18-telugu
Updated: June 18, 2020, 1:15 PM IST
చైనా ఫుడ్‌ను బహిష్కరించాలన్న కేంద్రమంత్రి
రాందాస్ అథవాలే(ఫైల్ ఫోటో)
  • Share this:
చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మందికిపైగా భారతీయ సైనికులు చనిపోవడంపై దేశంలో ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే దేశంలో చైనా వస్తువులను నిషేధించాలనే డిమాండ్ జోరందుకుంది. తాజాగా కేంద్రమంత్రి రాందాస్ అథవాలే కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు. చైనీస్ వంటకాలను విక్రయించే రెస్టారెంట్లను బహిష్కరించాలని ఆయన అన్నారు. ప్రజంలతా చైనీస్ ఫుడ్‌ను బాయ్‌కాట్ చేయాలని అన్నారు. అంతకుముందు చైనాపై మంత్రి రాందాస్ అథవాలే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత్ చైనాకు శాంతిని సూచించే బుద్ధుడిని ఇచ్చిందని... యుద్దాన్ని కాదని ట్విట్టర్‌లో వెల్లడించారు.



ఒకవేళ చైనా బలగాలు యుద్ధాన్ని కోరుకుంటే ఆ దేశానికి శాశ్వతమైన గుణపాఠం చెబుతామని అన్నారు. ప్రస్తుతం భారత్ కరోనాతో యుద్ధం చేస్తోందని... అందుకే తాము ఇప్పుడు యుద్ధాన్ని కోరుకోవడం లేదని అన్నారు. తాము బుద్ధా(శాంతి)ని కోరుకుంటున్నామని అన్నారు. తాము కరోనాతో యుద్ధంలో గెలుస్తామని... ఒకవేళ చైనాతో యుద్ధం జరిగితే అందులోనూ విజయం సాధిస్తామని మంత్రి రాందాస్ అథవాలే అన్నారు.


First published: June 18, 2020, 1:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading