చిల్లర రాజకీయాలు మానుకోవాలంటూ కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీని ఉద్దేశించి కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఫైర్ అయ్యారు. బీజేపీ ఎక్కడా మత విభేదాలు సృష్టించలేదని, స్థాయి తక్కువ రాజకీయాలు చేయోద్దంటూ ఆయన హితవు పలికారు. కాంగ్రెస్ వర్కింట్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సందర్భంగా కేంద్రాన్ని సోనియా విమర్శించిన నేపథ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ మత విభేధాలు సృష్టించట్లేదని, కరోనాపై అలుపెరగని యుద్ధం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేయోద్దని కోరారు. అయితే అంతకుముందు సోనియా.. కరోనాపై అందరూ ఐక్యమత్యంగా పోరాడుతుంటే.. బీజేపీ మాత్రం సామాజిక సామరస్యానికి తీరని నష్టం కలిగిస్తుందంటూ వ్యాఖ్యానించారు. మనమందరం కరోనా వైరస్‌పై కలసికట్టుగా పోరాడుతున్నామని, బీజేపీ మాత్రం మత వైరస్, విద్వేషాన్ని వ్యాప్తిని కొనసాగిస్తోందంటూ విరుచుకుపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Congress, Sonia Gandhi