Home /News /national /

UNION MINISTER NITIN GADKARI SAYS BUS CHARGES WILL REDUCE 30 PERCENT IF ELECTRIC VEHICLES USED INSTEAD OF DIESEL AK

Bus Charges: అలా చేస్తే.. బస్ టికెట్ ధరలు 30 శాతం తగ్గుతాయి.. కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Nitin Gadkari: డీజిల్ ధరలు పెరగడం కారణంగా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు బస్సు ఛార్జీలను పలుసార్లు పెంచాయి. దీంతో టికెట్ ధరలు 50 శాతానికిపైగా పెరిగాయి. భవిష్యత్తులో డీజిల్ ధరలు మరింతగా పెరిగితే.. మళ్లీ ఛార్జీలు పెంచకతప్పని పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇంకా చదవండి ...
    దేశంలోని ప్రజా రవాణా అవస్థాపనలో డీజిల్ ఇంధన వినియోగాన్ని తగ్గించాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. దీనితో పాటు, డీజిల్‌తో నడిచే బస్సుల కంటే ఎలక్ట్రిక్ బస్సులకు ప్రయాణీకుల టిక్కెట్లు 30 శాతం తక్కువ ధరకు లభిస్తాయని ఆయన చెప్పారు. బస్సులు ఖరీదైన డీజిల్‌తో నడుపుతున్నందున దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాల రోడ్డు రవాణా సంస్థలు ఎప్పటికీ లాభాల్లోకి రాలేవని సోమవారం ఇండోర్‌లో గడ్కరీ అన్నారు. డీజిల్ బస్సుల కంటే విద్యుత్తుతో నడిచే ఏసీ బస్సుల ప్రయాణీకుల టిక్కెట్లు సులభంగా 30 శాతం వరకు తక్కువ ధరకు లభిస్తాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 50 వేల ఎలక్ట్రిక్ బస్సులను నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని గడ్కరీ చెప్పారు. దేశ రవాణా వ్యవస్థను దూరదృష్టితో మార్చాలని అన్నారు.

    వాహనాల్లో పెట్రోల్‌-డీజిల్‌కు బదులుగా విద్యుత్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఇథనాల్‌, బయో-సీఎన్‌జీ, బయో ఎల్‌ఎన్‌జీ వంటి చౌక ఇంధనాల వినియోగాన్ని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని గడ్కరీ అభిప్రాయపడ్డారు. ఇక డీజిల్ ధరలు పెరగడం కారణంగా తెలుగు రాష్ట్రాల ఆర్టీసీలు బస్సు ఛార్జీలను పలుసార్లు పెంచాయి. దీంతో టికెట్ ధరలు 50 శాతానికిపైగా పెరిగాయి. భవిష్యత్తులో డీజిల్ ధరలు మరింతగా పెరిగితే.. మళ్లీ ఛార్జీలు పెంచకతప్పని పరిస్థితి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం కారణంగా బస్ టికెట్ ధరలు భారీగా తగ్గించవచ్చని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.



    ఈ కార్యక్రమంలో మధ్యప్రదేశ్‌లో రూ.2,300 కోట్లతో 5 రోడ్డు ప్రాజెక్టులకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టులు మహారాష్ట్ర మరియు దక్షిణాది రాష్ట్రాలతో మధ్యప్రదేశ్‌కు రహదారి కనెక్టివిటీని మెరుగుపరుస్తాయి. ఉపాధి, పెట్టుబడి అవకాశాలను కూడా పెంచుతాయి. 20 ఫ్లై ఓవర్ల నిర్మాణానికి ఆమోదం ఇండోర్, భోపాల్, సాగర్, గ్వాలియర్, జబల్‌పూర్, రత్లాం, ఖాండ్వా, ధార్, ఛతర్‌పూర్, విదిశాలో 20 ఫ్లైఓవర్‌ల నిర్మాణానికి ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ డిమాండ్ మేరకు గడ్కరీ ఆమోదం ప్రకటించారు.

    Indian Railway: రైల్వేశాఖ కీలక నిర్ణయం.. ఇకపై రైల్వేస్టేషన్లలో వాటి పేరు మార్పు.. ఎందుకంటే..

    Kala Taj Mahal: నలుపు రంగు తాజ్‌మహల్ ఉందని మీకు తెలుసా..? కాలా మహల్ ప్రత్యేకతలు ఇవే..!

    2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ మధ్యప్రదేశ్‌కు రూ.2.5 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను మంజూరు చేసిందని, 2024 చివరి నాటికి ఈ సంఖ్య రూ.4 లక్షల కోట్లకు పెరుగుతుందని గడ్కరీ చెప్పారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Electric Vehicles, Nitin Gadkari

    తదుపరి వార్తలు