#MissionPaani: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రమంత్రి గడ్కరీ కితాబు

MissionPaani : నదుల్లో చేరుతున్న చాలా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. దాన్ని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ నెట్‌వర్క్18-హార్పిక్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ పానీ క్యాంపెయిన్‌లో వివరించారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందన్నారు.

news18-telugu
Updated: August 27, 2019, 5:06 PM IST
#MissionPaani: కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు కేంద్రమంత్రి గడ్కరీ కితాబు
నితిన్ గడ్కరీ, కాళేశ్వరం ప్రాజెక్ట్
news18-telugu
Updated: August 27, 2019, 5:06 PM IST
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసించారు. గోదావరి నీటిని సద్వినియోగం చేసుకునే విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఎంతో మంచి చేస్తోందని ఆయన కితాబిచ్చారు. నెట్‌వర్క్18-హార్పిక్ సంయుక్తంగా చేపట్టిన మిషన్ పానీ క్యాంపెయిన్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా ముంబైలో ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. మిషన్ పానీ క్యాంపెయిన్‌పై తన అభిప్రాయాలను పంచుకున్న గడ్కరీ... నీటి పరిరక్షణ కోసం ప్రభుత్వం తరపున చేపడుతున్న కార్యక్రమాల గురించి తెలిపారు.

నదుల్లో చేరుతున్న చాలా నీరు వృథాగా సముద్రంలో కలుస్తోందని.. దాన్ని ఒడిసిపట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి పని చేసిందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చే ఇంద్రావతి, అటు గోదావరి నదుల నీటిని ఒడిసిపడుతోందన్నారు. గతంలో ఈ నీళ్లన్నీ వృథాగా సముద్రంలో కలిసిపోయేవని.. తెలంగాణ ప్రభుత్వం ఆ నీటిని ఉపయోగించుకుంటోందని చెప్పారు.





రూ. 80 వేల కోట్ల వ్యయం అంచనాతో నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి జీవధారగా అభివర్ణిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే మేడగడ్డ, అన్నారం బ్యారేజీల్లో నీటి పంపుల ద్వారా గోదావరి నీటిని ఎగువకు ఎత్తిపోస్తోంది. వివిధ దశల్లో సాగుతున్న ఈ ప్రాజెక్ట్ పనులను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
First published: August 27, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...