హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Nitin Gadkari: యూట్యూబ్ ద్వారా నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి.. ఎలాగంటే..

Nitin Gadkari: యూట్యూబ్ ద్వారా నెలకు రూ. 4 లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి.. ఎలాగంటే..

నితిన్ గడ్కరీ (ఫైల్ ఫోటో)

నితిన్ గడ్కరీ (ఫైల్ ఫోటో)

Nitin Gadkari: తన వీడియోలకు గానూ యూట్యూబ్ తనకు నెలకు రూ. 4 లక్షలు రాయల్టీ చెల్లిస్తోందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు.

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సమయంలో తన యూట్యూబ్ ఛానల్ చూసే వారి సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు. అంతేకాదు తన వీడియోలకు గానూ యూట్యూబ్ తనకు నెలకు రూ. 4 లక్షలు రాయల్టీ చెల్లిస్తోందని నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించారు. తాను చెఫ్‌గా మారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అనేక లెక్చర్లు ఇచ్చానని ఆయన తెలిపారు. దాదాపు ఆన్‌లైన్‌లో 950 లెక్చర్లు ఇచ్చారని, తన వీడియోలు చూసిన వారిలో ఫారిన్ విద్యార్థులు కూడా ఉన్నారని కేంద్రమంత్రి అన్నారు. ఆ వీడియోలన్నీ యూట్యూబ్‌లో పొందుపర్చారని తెలిపారు. ఈ కారణంగా తన ఛానల్‌ను చూసే వారి సంఖ్య బాగా పెరిగిందని నితిన్ గడ్కరీ వెల్లడించారు. ప్రస్తుతం యూట్యూబ్ తనకు నెలకు రూ. 4 లక్షలు రాయల్టీ చెల్లిస్తోందని అన్నారు. ప్రస్తుతం ఆయన ఛానల్‌కు రెండు లక్షల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.

తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వెల్లడించే గడ్కరీ.. మన దేశంలో మంచి పని చేసే వారికి ప్రొత్సాహం లభించదని అన్నారు. కరోనా సమయంలో తాను రెండు పనులు చేసినట్టు నితిన్ గడ్కరీ తెలిపారు. ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారిపై సమీక్ష నిర్వహించిన కేంద్రమంత్రి.. రోడ్ల నిర్మాణం కాంట్రాక్టర్లు, కన్సల్టెంట్లకు రేటింగ్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించిందని తెలిపారు. గుజరాత్‌లో రూ. 35,100 కోట్లతో 423 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టినట్టు తెలిపారు.

Telangana: టీఆర్ఎస్ ఎమ్మెల్యేకు కీలక పదవి కట్టబెట్టిన సీఎం కేసీఆర్

YS Jagan: 2024 ఎన్నికల ప్లాన్ బయటపెట్టిన సీఎం జగన్.. మంత్రులతో కీలక వ్యాఖ్యలు..

ఆర్థిక అభివృద్ధికి నాణ్యమైన రహదారులు ఉపయోగపడతాయని.. వాటి వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని వ్యాఖ్యానించారు. ఢిల్లీ, ముంబై ఎక్స్‌ప్రెస్ రహదారి ప్రాజెక్టులో భాగంగా గుజరాత్‌లో 60 మేజర్ బ్రిడ్జిలు, 17 ఇంటర్ ఛేంజ్‌లు, 17 ఫ్లై ఓవర్లు, 8 రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం జరుగుతుందని అన్నారు. వీటితో పాటు ఎక్స్‌ప్రెస్ రహదారిపై 33 వే సైడ్ అమెనిటీస్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని నితిన్ గడ్కరీ తెలిపారు.

First published:

Tags: Nitin Gadkari, Youtube

ఉత్తమ కథలు