తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణకు ప్రత్యేక హోదాపై కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదాను పరిగణలోకి తీసుకోవద్దని ఆర్ధిక శాఖ తేల్చి చెప్పింది. అందుకే ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిగణలోకి తీసుకోలేదని చెప్పుకొచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశాన్ని పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఆర్ధిక శాఖ మాత్రం వద్దని చెప్పారని అన్నారు. కాగా ఏపీ, తెలంగాణ, బీహార్, ఒడిశా రాష్ట్రాలు కొన్నిరోజులుగా ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుండగా తాజాగా నిర్మలా సీతారామన్ (Union Minister Nirmala Sitharaman) వ్యాఖ్యలు ఆ అంశంపై క్లారిటీ ఇచ్చారు. ఒడిశాలో పర్యటించిన కేంద్రమంత్రి స్పెషల్ స్టేటస్ పై ఈ వ్యాఖ్యలు చేశారు.
ఏపీ సహా దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యంకాదని అనేకసార్లు కేంద్రం చెప్పింది. అలాగే ఇదే అంశాన్ని ఇటీవల కేంద్రం మరోసారి రాజ్యసభలో స్పష్టం చేసింది. పంజాబ్‌కు చెందిన ఓ ఎంపీ ప్రత్యేక హోదా(Special Status) అంశం ఉనికిలో ఉందా ? ఉంటే పంజాబ్ రాష్ట్రానికి కూడా ప్రత్యేక హోదా ఇచ్చే అంశాన్ని పరిశీలించారని కోరారు. అయితే దీనిపై స్పందించిన కేంద్రం.. దేశంలోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని పేర్కొంది. ప్రత్యేక పరిస్థితుల వల్ల గతంలో జాతీయ అభివృద్ధి మండలి కొన్ని రాష్ట్రాలకు హోదా ఇచ్చిందని వెల్లడించింది. ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం ఉనికిలో లేదని చెప్పింది. జనరల్ కేటగిరి రాష్ట్రాలు, ప్రత్యేక హోదా రాష్ట్రాల మధ్య పన్నుల పంపినీలో 14వ ఆర్థిక సంఘం తేడా చూపలేదని అభిప్రాయపడింది. 2015-2020 మధ్య పన్నుల వాటాను 32 నుంచి 42 శాతానికి పెంచామని వెల్లడించింది. 15వ ఆర్థిక సంఘం కూడా 41 శాతం పన్నుల వాటాకు సిఫార్సు చేసిందని వివరించింది.
అయితే ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇచ్చే ఛాన్స్ అవకాశం లేదని గత కొన్నేళ్లలో అనేకసార్లు స్పష్టం చేసింది. అందుకు సమానమైన ప్రయోజనాలు వివిధ రూపాల్లో అందించామని పేర్కొంది. కానీ ఈ విషయంలో కేంద్రాన్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని ఏపీకి చెందిన అధికార వైసీపీ (Ysrcp) పదే పదే చెబుతోంది. అనేకసార్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ సీఎం జగన్ కేంద్రాన్ని కోరుతూ వస్తున్నారు. కానీ కేంద్రం మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.
కాగా కేంద్రమంత్రి వ్యాఖ్యలు బట్టి చూస్తుంటే దేశంలోని ఏ రాష్ట్రానికి కూడా స్పెషల్ స్టేటస్ ఇచ్చేందుకు సిద్ధంగా లేదని తెలుస్తుంది. ఇక ఈ అంశంపై ఆర్ధిక శాఖ క్లారిటీ ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఏపీతెలంగాణ విభజన సమయంలో ప్రత్యేక హోదా అంశం పరిగణలోకి తీసుకున్నప్పటికీ ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ మాత్రం ఎవరికీ స్పెషల్ స్టేటస్ ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పడంతో ఆ అంశం పరిగణలో లేదన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ap, AP Special Status, India, Nirmala sitharaman, Telangana