#MeToo: 'మీ టూ' సుడిగుండంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్

ఎంజే అక్బర్ గతంలో పలు వార్తా సంస్థల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ది టెలిగ్రాఫ్, ఏషియన్ ఏజ్, ది సండే గార్డియన్ వంటి వార్తా సంస్థల్లో ఎడిటర్‌గా విధులు నిర్వహించారు. ఐతే ప్రస్తుతం మహిళా జర్నలిస్టులు చేస్తున్న ఆరోపణలపై ఆయన నోరు విప్పలేదు.

news18-telugu
Updated: October 14, 2018, 12:29 PM IST
#MeToo: 'మీ టూ' సుడిగుండంలో కేంద్రమంత్రి ఎంజే అక్బర్
ఎంజే అక్బర్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: October 14, 2018, 12:29 PM IST
దేశవ్యాప్తంగా 'మీ టూ' (నేను కూడా) ఉద్యమం హాట్‌టాపిక్‌గా మారింది. లైంగిక వేధింపులకు గురైన బాధితులు.. గట్టిగా గళం విప్పుతున్నారు. తమకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ..సోషల్ మీడియాలో పెద్ద ఉద్యమాన్నే నడుపుతున్నారు. హాలీవుడ్‌లో మొదలైన ఈ ఉద్యమం..ఇప్పుడు బాలీవుడ్‌ను షేక్ చేస్తోంది. నానా పటేకర్, అలోక్ నాథ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. కేవలం సినీ స్టార్లే కాదు..రాజకీయ నేతలపైనా ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర విదేశాంగశాఖ సహాయమంత్రి, మాజీ జర్నలిస్ట్ ఎంజే అక్బర్‌పై మహిళా జర్నలిస్టులు ఆరోపణలు చేయడంపై తీవ్ర దుమారం రేగుతోంది.

ఒక్కరు కాదు..ఏకంగా నలుగురు మహిళా జర్నలిస్టులు అక్బర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. అక్బర్ లైంగికంగా వేధించారని మొదట ప్రియారమణి ఆరోపించింది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఆమె గత ఏడాదే బయటపెట్టింది. వోగ్ ఇండియాలో దీనిపై అప్పట్లోనే ఆమె ఓ ఆర్టికల్ రాసినప్పటికీ.. అక్బర్ పేరును మాత్రం ప్రస్తావించలేదు. ఇంటర్వ్యూ పేరుతో హోటల్‌కు పిలిచి అసభ్యంగా ప్రవర్తించానని మాత్రమే ఆరోపించారు. ఐతే ఇప్పుడు మీటూ ఉద్యమం నేపథ్యంలో అక్బర్ పేరును బయటపెడుతున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.



నాకూ ఇలాంటి అనుభమే ఎదరయిందని..మరో జర్నలిస్ట్ శుమా రహా ట్విటర్‌లో ఆరోపణలు చేశారు. 1995లో ఏషియన్ ఏజ్ సంస్థలో జాబ్ కోసం తాజ్ బెంగాల్ హోటల్‌ (కోల్‌కతా)లో ఇంటర్వ్యూకు పిలిచారని..ఆ సమయలో తనతో అక్బర్ అసభ్యంగా ప్రవర్తించారని తెలిపారు. 1995లో ఈ ఘటన జరిగిందని ట్విటర్‌లో పేర్కొన్నారు.

మరో మహిళా జర్నలిస్ట్ ప్రేరణా సింగ్ బింద్రా సైతం అక్బర్‌పై ఆరోపణలు చేశారు. ఆఫీస్ అంశాలపై చర్చించేందుకు ఓ హోటల్‌కు పిలిచి లైంగికంగా వేధించాడని ట్విటర్‌లో మండిపడ్డారు. 17 ఏళ్ల కిందట ఇది జరిగిందని..తన దగ్గర ఆధారాలేమీ లేకపోవడంతో బయటకు రాలేదని ట్వీట్ చేశారు.



ఎంజే అక్బర్ గతంలో పలు వార్తా సంస్థల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు. ది టెలిగ్రాఫ్, ఏషియన్ ఏజ్, ది సండే గార్డియన్ వంటి వార్తా సంస్థల్లో ఎడిటర్‌గా విధులు నిర్వహించారు. ఐతే ప్రస్తుతం మహిళా జర్నలిస్టులు చేస్తున్న ఆరోపణలపై ఆయన నోరు విప్పలేదు. ఆయనలో నైజీరియలో ఉన్నారని.. తిరిగొచ్చాక స్పందించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

కాగా, అక్బర్‌పై వస్తున్న ఆరోపణలపై కొందరు జర్నలిస్టులు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్‌ను నిలదీస్తున్నారు. మహిళగా, తోటి మంత్రిగా మీ స్పందనేంటని ప్రశ్నించారు. కానీ ఆమె మాత్రం సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. ట్విటర్‌లోనూ ఇలాంటి ప్రశ్నలను గుప్పిస్తున్నారు నెటిజన్లు. కానీ వాటిపై ఇటు అక్బర్ గానీ, అటు సుష్మా గానీ స్పందించడం లేదు.
First published: October 9, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...