ఆ కేసులు తగ్గిపోవడంపై కిషన్ రెడ్డి ఆందోళన

ఒత్తిడిలో ఉన్నప్పటికీ డాక్టర్లు ప్రజాసేవకు ముందుకు వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు.

news18-telugu
Updated: April 25, 2020, 2:34 PM IST
ఆ కేసులు తగ్గిపోవడంపై కిషన్ రెడ్డి ఆందోళన
కిషన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గి పోయాయని.. ఇది విచిత్రమైన పరిస్థితి అని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా జబ్బు వస్తే ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని అన్నారు. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన పని ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆరోగ్య సేతు యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే... తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుందని ఆయన సూచించారు. అందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకుంటే మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్ చేస్తుందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. చాలా మంది డాక్టర్లు ప్రజలకు సేవలందిస్తామని ముందుకు వచ్చారని తెలిపారు.

ఒత్తిడిలో ఉన్నప్పటికీ డాక్టర్లు ప్రజాసేవకు ముందుకు వస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వాలు కరోనాను ఎదుర్కొనేందుకు అంకిత భావంతో పని చేస్తున్నాయని అన్నారు. కొన్ని నగరాలు, పట్టణాల్లో పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. ఇందుకు కారణం మర్కజ్ ప్రార్థనలు చేసిన సభ్యులేనని వ్యాఖ్యానించారు. దేశంలో 60శాతం కరోనా కేసులు మర్కజ్‌కు వెళ్లి వచ్చినవారివేనని కిషన్ రెడ్డి తెలిపారు. కేంధ్ర అధికారుల బృందాన్ని ప్రభుత్వం పంపించిందన్న కిషన్ రెడ్డి... రాష్ట్రాలకు పూర్తిస్థాయిలో సహకరిస్తున్నామని వెల్లడించారు.
Published by: Kishore Akkaladevi
First published: April 25, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading