లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... ఏమన్నారంటే...

ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్ కొనసాగుతుందా ? లేదా అనే అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి.

news18-telugu
Updated: April 8, 2020, 1:30 PM IST
లాక్‌డౌన్‌పై క్లారిటీ ఇచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి... ఏమన్నారంటే...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏప్రిల్ 14 తరువాత లాక్‌డౌన్ కొనసాగుతుందా ? లేదా అనే అంశంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి. లాక్ డౌన్‌ పొడిగించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై దేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడామని ఆయన తెలిపారు. నేడు అన్ని జిల్లాల ఎస్పీలతో మాట్లాడి నివేదికను ప్రధానికి ఇస్తామని కిషన్ రెడ్డి వివరించారు. ఈ నివేదిక ఆధారంగానే ప్రధాని నిర్ణయం తీసుకుంటారని ఆయన స్పష్టం చేశారు. కరోనా నుంచి బయటపడాలంటే లాక్‌డౌన్ తప్ప మరో మార్గం లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

ఏప్రిల్ 14 తర్వాత కూడా లాక్‌డౌన్ పొడిగించాలని ఆయన ప్రధాని మోదీకి సూచించారు. ఐతే కేవలం తెలంగాణయే కాదు.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇదే అభిప్రాయం వినిపిస్తోంది. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాకరే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్ సైతం ఇదే అభిప్రాయాన్ని వినిపిస్తున్నారు. పలు రంగాల నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించాలని కేంద్రానికి సూచిస్తున్నారు. దీంతో లాక్‌డౌన్‌ పొడగింపుపై కేంద్రం అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. అయితే లాక్‌డౌన్‌ పొడిగింపు వైపే కేంద్రం మొగ్గు చూపే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతోంది.

First published: April 8, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading