హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి రియాక్షన్..

తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి రియాక్షన్..

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు,బాక్సర్ నిఖత్ జరీన్

కేంద్రమంత్రి కిరణ్ రిజిజు,బాక్సర్ నిఖత్ జరీన్

Kiren Rijiju on Nikhat Zareen appeal : దేశ ప్రయోజనాలు, క్రీడలు,అథ్లెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు.

తెలంగాణలోని నిజామాబాద్‌కి చెందిన బాక్సర్ నిఖత్ జరీన్(23) చేసిన విజ్ఞప్తిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు సానుకూలంగా స్పందించారు. దేశ ప్రయోజనాలు, క్రీడలు,అథ్లెట్లను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని.. ఈ విషయాన్ని బాక్సింగ్ ఫెడరేషన్‌ దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. క్రీడాకారుల ఎంపికలో మంత్రి జోక్యం ఉండదని.. సెలక్షన్ కమిటీ స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. అయినప్పటికీ జరీన్ ఫిర్యాదును బాక్సింగ్ ఫెడరేషన్ దృష్టికి తీసుకెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతానని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

కాగా, క్రీడా నిబంధనలు ఉల్లంఘించి ట్రయల్స్ లేకుండానే క్రీడాకారులను ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపిక చేయడాన్ని నిఖత్ జరీన్ తప్పు పట్టారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలని.. నిబంధనల ప్రకారం ట్రయల్స్‌లో అర్హత సాధించినవారినే ఛాంపియన్‌షిప్ టోర్నీలకు,ఒలింపిక్స్‌కు ఎంపిక చేయాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకు విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి : మేరీ కోమ్ కోసం మమ్మల్ని బలి చేస్తారా.. : ఓ యువ బాక్సర్ ఆవేదన

First published:

Tags: Mary Kom

ఉత్తమ కథలు