న్యూఇయర్ వేళ నదిలో చేపలు పట్టిన కేంద్రమంత్రి.. వీడియో వైరల్

చేపలు పడుతున్న కిరణ్ రిజిజు

Kiren Rijiju: ఈశాన్య భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి అభివృద్ధి పనులను సమీక్షించారు మంత్రి కిరణ్ రిజుజు. ఓ కొండ ప్రాంతంలో నదిలో చేపలు పట్టి కాసేపు సరదాగా గడిపారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సందడి చేశారు

  • Share this:
    న్యూ ఇయర్ వేళ సాధారణంగా ఎక్కువ మంది ఆలయాలకు వెళతారు. ఈ సంవత్సరం అంతా శుభం కలిగే దీవించమని ప్రార్థనలు చేస్తారు. ఇంకొందరైతే పర్యాటక ప్రాంతాలకు వెళ్లి రిలాక్స్ అవుతారు. రాజకీయ నాయకులు మాత్రం ప్రజల్లోనే తిరుగుతారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉంటారు. మరి కొత్త ఏడాది వేళ కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజుజు ఏం చేశారో తెలుసా..? శుక్రవారం ఈశాన్య భారత్‌లోని మారుమూల ప్రాంతాల్లో పర్యటించి అక్కడి అభివృద్ధి పనులను సమీక్షించారు. ఓ కొండ ప్రాంతంలో నదిలో చేపలు పట్టి కాసేపు సరదాగా గడిపారు. అనంతరం గ్రామస్తులతో కలిసి సందడి చేశారు. వారి ఆటపాటలను స్వయంగా వీక్షించి రిలాక్స్ అయ్యారు. ఆ వీడియోను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు కిరణ్ రిజుజు. న్యూయర్ మొదటి రోజు ఇలా గడిచిపోయిందని ఆయన పేర్కొన్నారు. నరేంద్ర మోదీ చేపట్టి ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామానికి చేరడం సంతోషంగా ఉందని చెప్పారు.


    కిరణ్ రిజుజు వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. న్యూఇయర్ వేళ కూడా ప్రజల కోసం కొండ కోనల్లో తిరుగుతున్నారని ప్రశంసలు కురిపిస్తున్నారు. ట్విటర్ వేదికగా న్యూఇయర్ శుభాకాంక్షలు చెబుతున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published: