వారందరిపై చర్యలు తీసుకునే యోచనలో కేంద్ర హోంశాఖ ?

టూరిస్ట్ వీసాలతో ఇండోనేషియా నుంచి వచ్చిన 800 మంది నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్టు కేంద్ర హోంశాఖ గుర్తించింది.

news18-telugu
Updated: March 31, 2020, 1:30 PM IST
వారందరిపై చర్యలు తీసుకునే యోచనలో కేంద్ర హోంశాఖ ?
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాలన్నీ ఇప్పుడు ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్థనాలు చేసి వచ్చిన వారి కోసం గాలింపు మొదలుపెట్టాయి. అక్కడ ప్రార్థనాలు చేసిన వారిలోనే అధికంగా కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూస్తుండటంతో... తెలుగు రాష్ట్రాలు అలెర్ట్ అయ్యాయి. ఇదిలా ఉంటే... టూరిస్ట్ వీసాలతో ఇండోనేషియా నుంచి వచ్చిన 800 మంది నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్టు కేంద్ర హోంశాఖ గుర్తించింది. వారంతా వీసా నిబంధనలు ఉల్లంఘించారని ప్రకటించింది. వీరిపై కఠిన చర్యలు తీసుకునే విషయంపై కేంద్ర హోంశాఖ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ముంబైలో మరణించిన 68 ఏళ్ల ఫిలిప్పెన్స్ వ్యక్తి కూడా నిజాముద్దీన్ మత ప్రార్థనల్లో పాల్గొన్నట్టు అధికారులు ధృవీకరించారు. మరోవైపు తెలంగాణలోని కరీంనగర్‌లో పర్యటించిన పలువురు ఇండోనేషియన్లకు కరోనా పాజిటివ్ అని తేలింది. నగరంలో వారికి ఆశ్రయం కల్పించిన వ్యక్తికి కూడా కరోనా పాజిటివ్ అని తేలడంతో... నగరంలో అధికారలు హై అలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Published by: Kishore Akkaladevi
First published: March 31, 2020, 1:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading