Amith Shah: మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో హోంమంత్రి అమిత్ షా సమావేశం..హాజరైన సీఎం కేసీఆర్..

  • Share this:
    నక్సల్‌ ప్రభావిత రాష్ట్రాల్లో శాంతిభద్రతలు, అభివృద్ధి పనులను సమీక్షించేందుకు కేంద్రహోంశాఖ నేడు మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఏర్పాటుచేసింది. ఆదివారం ఉదయం 11 గంటలకు దిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో హోంమంత్రి అమిత్‌షా నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. ఇందులో బీహార్, ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ , కేరళ సీనియర్ అధికారులు, కేంద్ర హోం కార్యదర్శి, కేంద్ర సాయుధ పోలీసు దళాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అస్వస్థతకు గురవడంతో ఢిల్లీ ప్రయాణం రద్దు చేసుకున్నారు. వారి స్థానంలో ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు. కాగా ఈ సమావేశంలో తమ రాష్ట్రాల్లో వామపక్ష తీవ్రవాదం ప్రస్తుత పరిస్థితి, చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను ఆయా రాష్ట్రాలు వివరించాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన ఢిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో ప్రారంభమైన ఈ సదస్సుకు వామపక్ష తీవ్రవాద ప్రభావితం ఉన్న 10 రాష్ట్రాల్లో జరగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. గత నాలుగు సంవత్సరాల కాలంలో నక్సల్స్ ప్రభావం తగ్గిందన్న విషయాన్ని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు హోం శాఖ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా చూపించారు.

    మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో ముగిసిన హోమంత్రి సమావేశం


    నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల్లో ఉన్న ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రులు హోం శాఖ మంత్రితో చర్చించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో రాష్ట్రాలు చేస్తున్న అభివృద్ధిని పలు రాష్ట్రాల సీఎంలు హోం శాఖ మంత్రికి వివరించారు. యువత, మహిళలు నక్సలిజంలోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలంటే అభివృద్ధే ప్రధాన ఎజెండా అని ముఖ్యమంత్రులు హోం మంత్రికి వివరించారు. మావోయిస్టులకు వ్యతిరేకంగా చేపట్టాల్సిన ఆపరేషన్లపై భేటిలో చర్చించారు. భద్రతా పరమైన లోపాలను సరిదిద్దడం, మావోయిస్టు అనుబంధ సంస్థలపై చర్యలపై ప్రత్యేక చర్చ జరిగింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధితో పాటు మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం గురించి చర్చించారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో టెలికాం సెక్టార్ సంబంధించిన పనులను వేగవంతం చేయాలని రాష్ట్రాల ముఖ్యమంత్రుల హోంమంత్రిని కోరారు.
    Published by:Krishna Adithya
    First published: