Home /News /national /

Amit Shah: అమిత్ షాకి అనారోగ్యం... ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక

Amit Shah: అమిత్ షాకి అనారోగ్యం... ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిక

అమిత్ షా (credit - twitter)

అమిత్ షా (credit - twitter)

Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఈమధ్య వరుసగా అనారోగ్యం వస్తోంది. మొన్ననే కరోనా నుంచి కోలుకున్న ఆయన... మరోసారి శ్వాస సమస్యతో ఎయిమ్స్‌లో చేరారు.

    hahUnion Home Minister Amit Shah: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకి తీవ్రమైన అనారోగ్య సమస్య ఏర్పడింది. ఊపిరి తీసుకోలేకపోతుండటంతో... ఆయన్ని హడావుడిగా... ఢిల్లీలోని ఎయిమ్స్‌లో జాయిన్ చేశారు. మనకు తెలుసు... ఆగస్ట్ 2న అమిత్ షాకి కరోనా పాజిటివ్ వచ్చింది. వెంటనే ఆయన... గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌లో చేరారు. ఆ తర్వాత కరోనా నుంచి కోలుకొని ఆయన... ఆగస్ట్ 14న డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత మరోసారి అనారోగ్య సమస్య రావడంతో... ఆయన... మళ్లీ ఆగస్ట్ 18 ఢిల్లీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS)లో చేరారు. అప్పుడు ఆయనకు అలసట, ఒళ్లు నొప్పుల వంటివి ఉన్నాయని తెలిసింది. ఆగస్ట్ 31న డిశ్చార్జి అయ్యారు. తాజాగా శనివారం రాత్రి ఆయన శ్వాస సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతుంటే... రాత్రి 11 గంటలకు... ఆయన మరోసారి ఎయిమ్స్‌లో చేరినట్లు తెలిసింది.

    ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం... అమిత్ షా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ఇది రొటీన్ చెకప్పే అంటున్నారు సంబంధీకులు. డాక్టర్ల సలహాతోనే ఆయన ఎయిమ్స్‌లో చేరారని తెలుస్తోంది.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Amit Shah

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు