హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit shah: హోం మంత్రి అమిత్​షా సంచలన వ్యాఖ్యలు.. ఇక ఆ మూడు కుటుంబాల దాదాగిరి నడవదంటూ ఫైర్​

Amit shah: హోం మంత్రి అమిత్​షా సంచలన వ్యాఖ్యలు.. ఇక ఆ మూడు కుటుంబాల దాదాగిరి నడవదంటూ ఫైర్​

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కశ్మీర్​ ప్రజలను దోచుకున్న వారు ఇపుడు అభివృద్ధి (development)ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని షా ఆరోపించారు. వేల కోట్ల పెట్టుబడులు (Investments) కశ్మీర్​కు వచ్చాయని ఆయన వెల్లడించారు.

  జమ్మూకశ్మీర్ (Jammu Kashmir). భారత్లో అంతర్భాగంగా ఉన్నా.. దేశంలో ఎక్కడా లేనటువంటి అస్థిరత అక్కడ ఉంటుంది. జమ్మూ కశ్మీర్​కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేసి.. అక్కడి పరిస్థితులను చక్కదిద్దాలనే యోచనలో బీజేపీ ప్రభుత్వం (BJP government) అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే పెట్టుబడులు పెట్టేందుకు ఆయా చట్టాలను తీసుకొచ్చింది. కాగా, ఆదివారం నాడు కేంద్ర హోంశాఖ మంత్రి (union Home minister) అమిత్​షా (Amit shah) కశ్మీర్​లో పర్యటించారు. ఈ సందర్భంగా అమిత్​ షా పలు అభివృద్ధి పనులను (works) ప్రారంభించారు. కశ్మీర్​ ప్రజలను దోచుకున్న వారు ఇపుడు అభివృద్ధి (development)ని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని షా ఆరోపించారు. వేల కోట్ల పెట్టుబడులు (Investments) కశ్మీర్​కు వచ్చాయని ఆయన వెల్లడించారు. వచ్చే రోజుల్లో 50 వేల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని హోం మంత్రి ప్రజలకు చెప్పారు.  ఇక్కడ ఏ ఒక్కరి ప్రాణాలు పోనివ్వమని, ఉగ్రవాదాన్ని అంతం చేస్తామని అమిత్​షా అన్నారు.

  ఏం ఇచ్చాయి ఆ మూడు కుటుంబాలు..

  జమ్మూలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు అమిత్ షా ఆదివారం నాడు శంకుస్థాపన (Inauguration) చేశారు. భాజపా ఎమ్మెల్యే, ఎంపీలు, స్థానిక నేతలతో అమిత్ షా భేటీ కానున్నారు. జమ్ములో ఉన్న గురుద్వారాను కూడా సందర్శించారు.

  ‘‘ 70 ఏళ్లుగా  మూడు కుటుంబాలు జమ్మూకశ్మీర్‌కు ఏం ఇచ్చాయి- 87 మంది ఎమ్మెల్యేలు, 6 ఎంపీలు తప్ప.  కానీ, 30 వేల మందిని మోదీ జీ ప్రజాప్రతినిధులుగా చేశారు, ప్రతి గ్రామంలో పంచాయతీ లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మూడు కుటుంబాల ‘దాదాగిరి’ పనిచేయదు ”అని అమిత్ షా అన్నారు.

  అభివృద్ధిని ఎవరూ ఆపలేరు

  హోంశాఖ మంత్రి అమిత్​షా మాట్లాడుతూ.. ‘‘ ప్రజలకు అన్యాయం జరిగే సమయం అయిపోయింది. అది చెప్పేందుకే నేను జమ్ము (jammu) వచ్చాను. ఎవరూ మీకు అన్యాయం చేయలేరు. ఇక్కడ జరుగుతోన్న అభివృద్ధిని అడ్డుకోవాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారు. కానీ ఇక్కడ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్ము కశ్మీర్.. ఎన్నో ఆలయాలకు నెలవు. మాతా వైష్ణో దేవి ఆలయం (viashno devi temple) ఇక్కడే ఉంది. శ్యామా ప్రసాద్ ముఖర్జీ, ప్రేమ్ నాథ్ డోగ్రా వంటి వారి ప్రాణత్యాగానికి ఈ జమ్ముకశ్మీర్ ప్రతీక. ఇక్కడ అశాంతి నెలకొల్పాలని చూసేవారిని మేం సహించం” అని అన్నారు.

  ఇన్నాళ్లూ దోచుకున్నారు..

  అమిత్ షా.. స్థానిక రాజకీయ పార్టీల (Political parties)పై కూడా విమర్శలు గుప్పించారు. కశ్మీర్ ప్రజలను ఇన్నాళ్లు దోచుకున్న వారు ఇప్పుడు అభివృద్ధిని ఆపేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

  "ఈ ప్రాంతంలో కొత్త పారిశ్రామిక పాలసీని మేం తీసుకొచ్చినప్పుడు మిమ్మల్ని దోచుకున్న మూడు కుటుంబాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం వల్ల ఇప్పటివరకు ఇక్కడికి రూ.12 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 2022లోపు రూ.51 వేల కోట్లకు పైగా పెట్టుబడులు (Investments) ఇక్కడికి వస్తాయి “  అని అన్నారు. ఇక్కడున్న యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు వస్తాయని అమిత్​షా హామీ ఇచ్చారు.

  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Amit Shah, Jammu and Kashmir, Jammu kashmir

  ఉత్తమ కథలు