హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit shah: దేశ ఐక్యతను దెబ్బతీయలేవు.. వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్

Amit shah: దేశ ఐక్యతను దెబ్బతీయలేవు.. వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్

అమిత్ షా (ఫైల్)

అమిత్ షా (ఫైల్)

Amit Shah: దేశం అత్యున్నత స్థాయికి చేరకుండా ఏ దుష్ప్రచారమూ నిలువరించలేదని అమిత్ షా ట్వీట్ చేశారు. దుష్ప్రచారాలు భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించలేవని... అభివృద్ధి పైనే ఇండియా భవితవ్యం ఆధారపడి ఉందని అన్నారు.

దేశ ఐక్యతను ఎలాంటి దుష్ప్రచారం దెబ్బతీయలేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో కొనసాగుతున్న రైతు నిరసనలపై కొందరు విదేశాలకు చెందిన సెలబ్రిటీలు చేస్తున్న వ్యాఖ్యలకు ఆయన పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. భారతదేశ ఐక్యతను ఇలాంటివి చర్యలు దెబ్బతీయలేవని అన్నారు. దేశం అత్యున్నత స్థాయికి చేరకుండా ఏ దుష్ప్రచారమూ నిలువరించలేదని అమిత్ షా ట్వీట్ చేశారు. దుష్ప్రచారాలు భారతదేశ భవితవ్యాన్ని నిర్ణయించలేవని... అభివృద్ధి పైనే ఇండియా భవితవ్యం ఆధారపడి ఉందని అన్నారు. దేశం ఐక్యంగానే ఉంటుందని... అందరూ కలిసికట్టుగానే ప్రగతిని సాధిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు. అంతేకాదు ఇండియా ఎగైనెస్ట్ ప్రోపగాండా, ఇండియా టుగెదర్ అంటూ తన ట్వీట్‌కు య్యాష్ ట్యాగ్‌ ఇచ్చారు.

అంతకుముందు రైతుల ఆందోళనకు మద్దతుగా సింగర్ రిహానా చేసిన ట్విట్టర్‌లో ట్రెండ్ అయ్యింది. కొంతమంది ఆమెకు మద్దతు తెలిపితే.. మరికొందరు ఆమె తీరును తప్పుబట్టారు. రిహానా బాటలో స్పందించిన కమలా హ్యారిస్ మేన కోడలు మీనా హ్యారిస్, మరికొంత మంది ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు.. రైతులకు మద్దతుగా ట్వీట్లు చేశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్రం.. ఇందుకు సంబంధించి ట్విట్టర్‌కు నోటీసులు జారీ చేసింది. గతంలో ఈ రకమైన అకౌంట్లను బ్లాక్ చేయాలని కేంద్ర ఐటీ శాఖ ట్విట్టర్‌కు తెలిపింది. అయితే #ModiPlanningFarmerGenocide Hashtag అనే హ్యాష్‌ట్యాగ్‌ను సోమవారం రాత్రి నుంచి ట్విట్టర్ మళ్లీ అనుమతి ఇచ్చింది. దీంతో ట్విట్టర్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రభుత్వం.. తమ ఆదేశాలను పాటించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది. ఈ రకమైన హ్యాష్‌ట్యాగ్ ద్వారా చేస్తున్న పోస్టులు విద్వేషంతో పాటు సమాజంలో అశాంతిని పెంచుతాయని ప్రభుత్వం పేర్కొంది. మారణహోమం అనేది భావస్వేచ్ఛ కాదని.. అది శాంతి భద్రతలకు ఓ ముప్పు అని తెలిపింది.


గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రైతుల పరేడ్ సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల తరువాత ఈ కొందరు ట్విట్టర్‌లో ఈ హ్యాష్ ట్యాగ్‌ను క్రియేట్ చేశారు. తన నోటీసులో అరడజనకు పైగా సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించింది. ఈ అంశంలో ట్వీట్టర్ వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదని కేంద్రం స్పష్టం చేసింది.

ఓ వైపు ట్విట్టర్‌కు హెచ్చరిక జారీ చేసిన కేంద్రం.. ఈ రకమైన ప్రచారానికి కౌంటర్‌గా ప్రచారం మొదలుపెట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇండియా ఎగైనెస్ట్ ప్రోపగాండా, ఇండియా టుగెదర్ అంటూ తన ట్వీట్‌కు య్యాష్ ట్యాగ్‌ ఇచ్చారు.

First published:

Tags: Amit Shah, Farmers Protest