Home /News /national /

UNION HOME MINISTER AMIT SHAH SAID THAT HE LIKES HINDI LANGUAGE MORE THAN GUAJARATI AND HE EXPRESSED HIS VIEWS ON GANDHIJI INDEPENDENCE MOVEMENT PRV

Amit shah: నాకూ ఆ భాష అంటేనే మక్కువ అన్న కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. గాంధీజి స్వాతంత్య్ర ఉద్యమాన్ని అలా నడిపారంటూ వెల్లడి..

అమిత్​ షా

అమిత్​ షా

వారణాసిలో జరిగిన ‘అఖిల భారత అధికార భాషా సదస్సు’లో అమిత్ షా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ‘రాజ్‌భాష’ (జాతీయ భాష)పై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.

    ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Union Home minster Amit shah) ఇటీవలె వారణాసిలో భారతీయ జనతా పార్టీ విధాన సభ ఇన్‌ఛార్జ్‌తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారణాసిలోని కాల భైరవ ఆలయంలో ప్రార్థనలు చేశారు. శనివారం వారణాసిలో జరిగిన ‘అఖిల భారత అధికార భాషా సదస్సు’లో అమిత్ షా ప్రసంగించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ‘రాజ్‌భాష’ (జాతీయ భాష)పై ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. తనకు గుజరాతీ (Guajarati) కంటే హిందీ (Hindi) భాష అంటే ఎక్కువ అభిమానం అని అన్నారు. హిందీ భాష అంటే చాలా ఇష్టం. మన రాజభాషను బలోపేతం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. వారణాసిలో జరిగిన ‘అఖిల్ భారతీయ రాజభాషా సమ్మేళనం’లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా పాల్గొన్నారు. అమిత్ షా తన ప్రసంగానికి ముందు వారణాసిలోని దీనదయాళ్ హస్తకళా సంకుల్‌లో అఖిల భారతీయ రాజభాషా సమ్మేళనంలో హిందీ పత్రికను విడుదల చేశారు.

    గాంధీ (Gandhi)జీ స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రజా ఉద్యమంగా మార్చారని అమిత్​షా తెలిపారు. దానికి మూడు స్తంభాలుగా ఉన్నా- స్వరాజ్, స్వదేశీ, స్వభాష అని గుర్తు చేసిన అమిత్ షా.. స్వరాజ్యం సాధించుకున్నాం.. కానీ స్వదేశీ, స్వభాష వెనుకబడి ఉన్నాయని షా అన్నారు. హిందీకి మన స్థానిక భాషలన్నింటికీ (regional languages) ఎటువంటి వైరుధ్యం లేదన్నారు. ప్రధాని మోదీ నాయకత్వంలో రాజభాషపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

    వీర్ సావర్కర్ (veer Savarkar) లేకుంటే ఇప్పటికీ మనం ఇంగ్లీషు చదువుతూ ఉండేవాళ్లమని అమిత్ షా అన్నారు. హిందీ నిఘంటువును రూపొందించింది సావర్కర్ అని ఆయన గుర్తు చేశారు. ఇంగ్లీషు మాపై మోప బడింది. హిందీ డిక్షనరీ కోసం కృషి చేయాల్సి ఉంటుందని, దాన్ని బలోపేతం చేయాలన్నారు. 2019లోనే రాజధాని ఢిల్లీ నుంచి అఖిల భారత అధికార భాషా సదస్సును నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామని అమిత్ షా చెప్పారు. దేశానికి స్వాతంత్య్రాన్ని అందించిన వారి స్మృతి చిహ్నాలను పునరుజ్జీవింపజేసి యువ తరానికి స్ఫూర్తినివ్వడమే అమృత్ మహోత్సవ్ అని ప్రధాని మోడీ చెప్పారని, ఇది మనకు సంకల్ప సంవత్సరం అని అమిత్ షా అన్నారు

    రెండేళ్లుగా చేయలేకపోయాం..

    ‘‘కరోనా మహమ్మారి కారణంగా రెండేళ్లుగా చేయలేకపోయాం. కానీ ఈరోజు స్వాతంత్య్ర అమృతోత్సవంలో ఈ కొత్త శుభారంభం జరగబోతోందని సంతోషిస్తున్నాను. స్వాతంత్ర్య అమృత్ మహోత్సవ్‌లో, దేశ ప్రజలందరికీ పిలుపునిస్తున్నాను. స్వయం భాష కోసం మన లక్ష్యాలలో ఒకటి, మనం తప్పుకున్న దానిని మనం గుర్తుంచుకోవాలి. దానిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. హిందీ, మన స్థానిక భాషలన్నింటికీ వైరుధ్యం లేదు”అని అమిత్ షా స్పష్టం చేశారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Amit Shah, Mahatma Gandhi

    తదుపరి వార్తలు