హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం.. న్యూస్18‌ ఇంటర్వ్యూలో ముందే చెప్పిన అమిత్ షా

Amit Shah: గుజరాత్‌లో బీజేపీ భారీ విజయం.. న్యూస్18‌ ఇంటర్వ్యూలో ముందే చెప్పిన అమిత్ షా

న్యూస్18 ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా  (ఫైల్ ఫోటో)

న్యూస్18 ఇంటర్వ్యూలో మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా (ఫైల్ ఫోటో)

Amit Shah: గుజరాత్ ఎన్నికల ప్రచారం, వ్యూహరచన కీలక భూమిక పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. గుజరాత్‌ ఎన్నికల్లో తాము గత రికార్డులు తిరగరాసేలా విజయం సాధిస్తామని ముందుగానే ఊహించారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

గుజరాత్‌లో పాత రికార్డులను తిరగరాస్తూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సీట్లు సాధించిన బీజేపీ.. వరుసగా ఏడోసారి అధికార పగ్గాలు చేపట్టబోతోంది. ఒక రాష్ట్రాన్ని 25 ఏళ్లకు మించి వరుసగా పరిపాలించడం ఇప్పటి పరిస్థితుల్లో అంత తేలికైన వ్యవహారం కాదు. కానీ గుజరాత్‌లో తాము చేసిన అభివృద్ధి తమను మళ్లీ గెలిపిస్తుందని బీజేపీ పదే పదే చెబుతూ వస్తోంది. మరీ ముఖ్యంగా గుజరాత్ ఎన్నికల ప్రచారం, వ్యూహరచన కీలక భూమిక పోషించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit shah).. గుజరాత్‌ ఎన్నికల్లో(Gujarat Assembly Elections) తాము గత రికార్డులు తిరగరాసేలా విజయం సాధిస్తామని ముందుగానే ఊహించారు. నవంబర్ 14న న్యూస్18కు (News18) ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. న్యూస్18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్ రాహుల్ జోషి నిర్వహించిన ఇంటర్వ్యూలో గుజరాత్‌ ఎన్నికల్లో గత రికార్డులను బద్దలు కొట్టి అఖండ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

రాబోయే గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఓట్ల శాతం పెరుగుతుందని అమిత్ షా అన్నారు. సీట్లు కూడా పెరుగుతాయని చెప్పారు. భారీ మెజారిటీతో ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని.. ఇప్పటి వరకు మెరుగైన పనితీరు ఉంటుందని వ్యాఖ్యానించారు. న్యూస్ 18 ఇండియా నిర్వహించిన గుజరాత్ అధివేషన్’లో పాల్గొన్న అమిత్ షా.. గుజరాత్ అభివృద్ధికి బీజేపీ అన్ని విధాలుగా కృషి చేసిందని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తమ పార్టీ రాష్ట్ర ప్రజల అంచనాలను అందుకుందని వ్యాఖ్యానించారు.

ఇక గుజరాత్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం తమపై ఉండదని కూడా అమిత్ షా ముందుగానే చెప్పారు. గుజరాత్ ఏ తృతీయ పక్షాన్ని ప్రజలు ఎన్నడూ అంగీకరించలేదని తెలిపారు. గతంలో కేశూభాయ్ పటేల్ కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో పోటీ చేశారని.. శంకర్ సింగ్ వాఘేలా కూడా సొంత పార్టీతో బరిలోకి దిగారని గుర్తు చేశారు. అయితే గుజరాత్ ప్రజలు ఆ పార్టీలను పట్టించుకోలేదని.. ప్రస్తుతం గుజరాత్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆప్ విషయంలోనూ ఇదే జరుగుతుందని అన్నారు. ఆయన చెప్పినట్టుగానే గుజరాత్‌లో ఆప్ ప్రభావం బీజేపీపై పెద్దగా లేదని ఫలితాలు స్పష్టం చేశాయి. గుజరాత్‌లో కొందరు అనేక హామీలు ఇస్తున్నారన్న ఆప్‌ గురించి ప్రస్తావించిన అమిత్ షా.. రాష్ట్ర బడ్జెట్ రూ. 2,42,000 కోట్లుగా ఉంటే వారి ఇచ్చే హామీల విలువ రూ. 3,52,000 కోట్లుగా ఉందని గుర్తు చేశారు. కొందరు ఇచ్చే వాగ్దానాలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు. ప్రాథమిక విద్యను ఉచితంగా చేస్తామని కొందరు అంటున్నారని.. ఇది 1960 నుండి ఉచితమే అని అన్నారు. విద్యుత్ అనేది ఉచితం కాదని.. ఏ బిల్లు కూడా ఉచితం కాదని అన్నారు.

గుజరాత్ లో బీజేపీ దూకుడు..క్రికెటర్ జడేజా భార్య రివాబా ఘన విజయం

గుజరాత్ లో వార్ వన్ సైడ్..పని చేసిన మోదీ మేనియా..కలిసొచ్చిన అంశాలేంటో తెలుసా?

తాము పేదలకు చేయూత ఇచ్చే విధంగా చేస్తామని..కానీ వాటికి ఉచితాలకు ఎంతో తేడా ఉందని అమిత్ షా వివరించారు. పేదలను ప్రభావితం చేసిన కోవిడ్ తర్వాత మందగమనం కారణంగా మహమ్మారి మధ్య తాము ఉచిత రేషన్ ఇచ్చామని.. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఏ వర్గమైనా నష్టపోతే వారిని ఆదుకోవడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. అయితే ఇది ఉచితాలు కాదని అన్నారు. వారి జీవన ప్రమాణాలు పెంచడం, మౌలిక సదుపాయాలు ఇవ్వడం ముఖ్యమని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Amit Shah, Gujarat Assembly Elections 2022

ఉత్తమ కథలు