Home /News /national /

Amit Shah | ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

Amit Shah | ఎయిమ్స్‌లో చేరిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

హోం మంత్రి అమిత్ షా(ఫైల్ ఫోటో)

హోం మంత్రి అమిత్ షా(ఫైల్ ఫోటో)

Amit Shah | మూడు నాలుగు రోజుల నుంచి ఒంటి నొప్పులు సహా పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న అమిత్ షా.. పోస్ట్ కోవిడ్ కేర్ కోసం ఆస్పత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి.

    కొద్దిరోజుల క్రితం కరోనా నుంచి కోలుకుని హోం ఐసోలేషన్‌లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. సోమవారం రాత్రి ఎయిమ్స్‌లో చేరారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన ఎయిమ్స్ చేరారు. అమిత్ షా ఆరోగ్య పరిస్థితి ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. మూడు నాలుగు రోజుల నుంచి ఒంటి నొప్పులు సహా పలు సమస్యలతో ఇబ్బంది పడుతున్న అమిత్ షా.. పోస్ట్ కోవిడ్ కేర్ కోసం ఆస్పత్రిలో చేరినట్టు ఎయిమ్స్ వర్గాలు తెలిపాయి. ఆయన ఆస్పత్రి నుంచే తన విధులను నిర్వహిస్తున్నట్టు స్పష్టం చేశాయి.

    ఆగస్టు 2న కరోనా పరీక్షలు చేయించుకున్న అమిత్ షాకు పాజిటివ్’గా నిర్ధారణ అయ్యింది. ఆయనకు పెద్దగా కరోనా లక్షణాలు లేకపోయినప్పటికీ వైద్యుల సూచన మేరకు ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చేరారు. 12 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన అమిత్ షా.. కరోనా నెగిటివ్ రావడంతో ఈ నెల 14న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే వైద్యుల సూచన మేరకు కొన్ని రోజులు హోం ఐసొలేషన్‌లో ఉండాలని నిర్ణయించున్నారు. తాజాగా మరోసారి ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో ఎయిమ్స్‌లో చేరారు.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Amit Shah

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు