హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amit Shah: కశ్మీర్ పర్యటనలో అమిత్‌ షా చేసిన పనికి ప్రశంసలు.. కశ్మీరీల మనసు గెల్చుకున్న కేంద్ర హోం మంత్రి

Amit Shah: కశ్మీర్ పర్యటనలో అమిత్‌ షా చేసిన పనికి ప్రశంసలు.. కశ్మీరీల మనసు గెల్చుకున్న కేంద్ర హోం మంత్రి

అమిత్ షా

అమిత్ షా

Amit Shah: అమిత్‌షా బుధవారం జమ్మూ కశ్మీర్‌లో పర్యటించిన సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఆయన చేసిన పని కశ్మీరీల మనసు గెలుచుకుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Amit Shah) జమ్మూ కశ్మీర్‌ పర్యటన (Jammu Kashmir Tour) ముగిసింది. ఆయన ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాల పర్యటనపై దృష్టి పెట్టారు. మూడు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించి.. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అయితే కేంద్ర మంత్రి బుధవారం జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పర్యటించిన సందర్భంగా ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది. ఇక్కడ నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా పాల్గొన్నారు. ఈ సమయంలో సమీపంలోని మసీదు నుంచి ముస్లింలు నిర్వహించే 'అజాన్' ప్రార్థనకు పిలుపునివ్వడంతో తన ప్రసంగాన్ని కొద్దిసేపు నిలిపివేశారు. దీంతో ఆయన చేసిన పని కశ్మీరీల మనసు గెలుచుకుంది.

ఉత్తర కాశ్మీర్ జిల్లా బారాముల్లాలో నిర్వహించిన ర్యాలీ సందర్భంగా, స్థానిక షోకత్ అలీ స్టేడియంలో అమిత్‌షా అరగంట పాటు మాట్లాడారు. అయితే ఆయన స్పీచ్ మొదలుపెట్టిన ఐదు నిమిషాల తర్వాత, స్థానిక మసీదు నుంచి పెద్దగా అజాన్ శబ్దం వినిపించింది. దీంతో మసీదులో ఏమైనా జరుగుతోందా అని ఆయన స్టేజీపై ఉన్న వారిని అడిగారు.

అజాన్ జరుగుతోందని వారు అమిషాతో చెప్పగా, ఆయన తన ప్రసంగాన్ని కాసేపు ఆపేశారు. కొద్దిసేపటికి అజాన్ ముగిసిన తర్వాత, తన స్పీచ్ కొనసాగించవచ్చా అని అడిగారు. ‘అజాన్‌ అయిపోయింది, ఇప్పుడు నేను ప్రసగించవచ్చా..?’ అంటూ అక్కడున్నవాళ్లను ప్రశ్నించారు. దీంతో ర్యాలీకి వచ్చిన వారు చప్పట్లు, ఈలలతో అమిత్‌ షాను అభినందించారు.

* ఉత్సాహంగా సాగిన ప్రసంగం

ఈ ర్యాలీలో అమిత్‌ షా చాలా ఉత్సాహంగా మాట్లాడారు. ఉదయం నుంచి గంటల తరబడి వేచి ఉన్న ప్రజలను ఆనందపరిచేలా షా తన ప్రసంగాన్ని ప్రారంభించారు. జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ప్రధానమంత్రి కార్యాలయం (PMO) సహాయ మంత్రి జితేందర్ సింగ్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కానీ వీరు సభను ఉద్దేశించి ప్రసంగించలేదు.

ఇది కూడా చదవండి : ఢిల్లీ లిక్కర్ స్కామ్..హైదరాబాద్ సహా 35 చోట్ల ఈడీ సోదాలు..టైం వేస్ట్ అన్న కేజ్రీవాల్

* ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటన

మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా పార్టీ కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. ఈరోజు సిక్కింలో డెయిరీ కాన్‌క్లేవ్‌ను ప్రారంభించి, అక్కడ జేజేపీ నాయకులను కలుస్తారు. ఆ తర్వాత అస్సాంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శుక్రవారం సాయంత్రం అస్సాం చేరుకోనున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Amit Shah, Central Government, Jammu kashmir, National News

ఉత్తమ కథలు