Home /News /national /

Corona Vaccination: కరోనా వ్యాక్సిన్ ను బయట మార్కెట్లో కొనుక్కోవాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్..!

Corona Vaccination: కరోనా వ్యాక్సిన్ ను బయట మార్కెట్లో కొనుక్కోవాలనుకుంటున్న వారికి షాకింగ్ న్యూస్..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా వ్యాక్సినేషన్ కూడా బయటి మార్కెట్లోకి వస్తుందని అంతా ఊహించారు. కానీ ఆ ఊహలకు చెక్ పెడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషన్ ఓ ప్రకటన చేశారు. బహిరంగా మార్కెట్లో కరోనా టీకా లభ్యం గురించి శుక్రవారం ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇంకా చదవండి ...
    హమ్మయ్య, కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది. ఇక భయం లేదు. ఇవ్వాళ కాకుంటే కాస్త లేటయినా బయట బహిరంగ మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చేస్తుంది. రేటు ఎక్కువయినా కొనుక్కోవచ్చులే అని అనుకుంటున్న వారికి ఓ షాకింగ్ న్యూస్. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫ్రంట్ లైన్ వారియర్స్ కు కరోనా టీకాను ఇచ్చే పనిలో కేంద్రం నిమగ్నమయింది. ఇదే సమయంలో విదేశాలకు కూడా కరోనా టీకాను సరఫరా చేస్తోంది. మరికొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా సాధారణ ప్రజానీకానికి కూడా కరోనా టీకాను అందించే ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే అంతకంటే ముందే కరోనా టీకా బహిరంగా మార్కెట్లోకి వస్తుందని, రేటు ఎక్కవ ఉన్నా దాన్ని కొని వేసుకుందామని అధిక సంఖ్యలో ప్రజలు ఆశగా ఉన్నారు.

    కరోనా మహమ్మారి విజృంభించిన మొదట్లో కరోనా టెస్టులను ప్రభుత్వం మాత్రమే అధికారికంగా నిర్వహించేది. ఆ తర్వాత బయట కొన్ని ల్యాబ్స్ ను గుర్తించి వాటిల్లో కరోనా టెస్టులకు అనుమతించారు. ఆ తర్వాత్తర్వాత అధికారికంగానో, అనధికారికంగానో అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ కరోనా టెస్టులు జరుగుతున్నాయి. ఇదే కోవలో కరోనా వ్యాక్సినేషన్ కూడా బయటి మార్కెట్లోకి వస్తుందని అంతా ఊహించారు. కానీ ఆ ఊహలకు చెక్ పెడుతూ కేంద్ర ఆరోగ్య శాఖ సెక్రటరీ రాజేష్ భూషన్ ఓ ప్రకటన చేశారు. బహిరంగా మార్కెట్లో కరోనా టీకా లభ్యం గురించి శుక్రవారం ఆయన కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

    ’భారత్ ప్రస్తుతానికి రెండు రకాల టీకాలను ప్రజల వినియోగానికి అనుమతించింది. వీటిని బహిరంగ మార్కెట్లలోకి తీసుకొచ్చే ఆలోచన లేదు. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనుమతి వచ్చేంత వరకు బహిరంగ మార్కెట్లలోకి కరోనా టీకాను లభ్యం కానివ్వం. ఫలానా సమయంలోగా బహిరంగ మార్కెట్లలోకి తీసుకురావాలని మేమేం నిర్ణయించుకోలేదు. వచ్చే ఏడెనిమిది నెలల్లో దేశంలోని అత్యధిక మంది జనాభాకు కరోనా టీకాను అందివ్వాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రస్తుతం అందిస్తున్న కరోనా వ్యాక్సిన్లను ఏ ఒక్క ప్రైవేటు సంస్థకు అందివ్వలేదు‘ అని భూషన్ ప్రకటించారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Corona Possitive, Corona Vaccine, Corona virus, COVID-19 vaccine

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు