హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Rising India Summit: దేశంలో ఆకస్మిక గుండెపోటు మరణాలపై స్పందించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ

Rising India Summit: దేశంలో ఆకస్మిక గుండెపోటు మరణాలపై స్పందించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ

రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో మాట్లాడుతున్న కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ

రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో మాట్లాడుతున్న కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ

Mansukh Mandaviya: ‘రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023’లో పాల్గొని మన్‌సుఖ్ మాండవీయ ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ సక్సెస్ స్టోరీ గురించి ఆయన వివరంగా చెప్పారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

భారత ప్రజానీకం, భారత ప్రజాస్వామ్యం ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ స్పష్టం చేశారు. వీటి ఆరోగ్యం ట్రాక్‌లోనే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు. న్యూస్ 18 నెట్‌వర్క్ నిర్వహిస్తున్న ‘రైజింగ్ ఇండియా సమ్మిట్ 2023’లో పాల్గొని మన్‌సుఖ్ మాండవీయ(Mansukh Mandaviya) ముఖ్యమైన విషయాలు వెల్లడించారు. కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ (Vaccination Drive) సక్సెస్ స్టోరీ గురించి ఆయన వివరంగా చెప్పారు. కరోనా నివారణ వ్యాక్సిన్‌పై ప్రతిపక్షాలు అవలంబించిన ద్వంద్వ వైకరిని ఆయన తప్పు పట్టారు. కరోనా మహమ్మారి తర్వాత ఆకస్మిక గుండెపోటు(Heart Attack) కారణంగా మరణించిన వారి మరణాలపై ICMR దర్యాప్తు చేస్తోందని అన్నారు. దాని నివేదిక రెండు నెలల్లో వస్తుందని చెప్పారు. ఆ తర్వాత తగిన చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలోని ప్రజల ఆరోగ్యం, ప్రజాస్వామ్యం రెండూ ట్రాక్‌లో ఉన్నాయని అన్నారు.

వ్యాక్సినేషన్ సక్సెస్ వెనుక..

కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయం వెనుక ప్రధాని మోదీ అనితర సాధ్యమైన కృషి దాగి ఉందని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ కొనియాడారు. ఒకవేళ వ్యాక్సిన్ తయారీలో విఫలమైతే ఆ నింద తాను మోస్తానని చెప్పిన ఏకైక గొప్ప ప్రధాని మోదీ అంటూ ప్రశంసించారు. ‘కోవిడ్‌తో భారత్ తీవ్రంగా పోరాడుతున్న సమయమది. ఈ విపత్తు నుంచి బయట పడాలంటే టీకా ఒక్కటే పరిష్కారమని సైంటిస్టులు చెప్పారు. సాధారణంగా వ్యాక్సిన్ తయారీకి సుమారు 7 నుంచి 15 ఏళ్లు పడుతుంది. ధర కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతో శాస్త్రవేత్తలను మోదీ కలిసి వ్యాక్సిన్ తయారీ గురించి చర్చించారు. ఎంత ఖర్చైనా ఫర్వాలేదని, వ్యాక్సిన్ ప్రక్రియ మొదలు పెట్టాలని వారికి మోదీ సూచించారు. ఒకవేళ విఫలం అయితే ఆ నింద తనపై వేసుకుంటానని చెప్పి ఉదారత చాటుకున్నారు. సఫలమైతే సైంటిస్టులకే క్రెడిట్ ఇస్తానని మోదీ మాటిచ్చారు’ అని మాండవీయ తెలిపారు. 2020, డిసెంబర్ 20న ప్రపంచంలో మొదటి డోసు అందుబాటులోకి వస్తే 2021 జనవరి 16 నాడు తొలి దేశీయ టీకాను తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు.

ప్రతిపక్షాలపై మండిపాటు..

వ్యాక్సిన్‌పై ప్రతిపక్షాలు అవలంబించిన వైకరిని కేంద్రమంత్రి తీవ్రంగా తప్పుపట్టారు. టీకాను వేసుకోవద్దని ప్రజలను ఏమార్చేందుకు ప్రతిపక్షాలు ట్రై చేశాయన్నారు. ‘తొలుత నరేంద్రమోదీ వ్యాక్సిన్ ఎందుకు వేసుకోరని ప్రశ్నించారు. ఆ తర్వాత మోదీ టీకా వేసుకున్నాక.. ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వరా? అని మాట మార్చారు. 50శాతం ప్రజలు టీకా తీసుకోలేదంటూ నాయకులు వాపోయారు’ అని కేంద్రమంత్రి గుర్తు చేశారు. ఇలా కోవిడ్ వ్యాక్సిన్‌పై ప్రతిపక్షాలు రాజకీయం చేయాలని చూసినట్లు ఆయన చెప్పారు.

విదేశాలే ఆశ్చర్యపోయాయి..

కోవిడ్‌ వ్యాక్సిన్‌ని భారత్ త్వరగా రెడీ చేయడంపై విదేశాలు ఆశ్చర్యం వ్యక్తం చేశాయని కేంద్రమంత్రి చెప్పుకొచ్చారు. మొదట భారత్ వ్యాక్సిన్ తెస్తుందా అని విదేశీ ప్రతినిధులు భావించారట. వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమావేశాలకు రెండు సార్లు హాజరైన సందర్భం గురించి కేంద్రమంత్రి వివరించారు. ‘2022 సెప్టెంబర్‌లో సమావేశాలకు హాజరయ్యా. ఫర్వాలేదు భారత్ వ్యాక్సిన్ తయారు చేస్తోందని వారు అభిప్రాయపడ్డారు. 2023 జనవరిలో మళ్ళీ సమావేశాలకు వెళ్లా. భారత్ కోవిడ్ వ్యాక్సినేషన్ డ్రైవ్, మేనేజ్‌మెంట్‌లో ఎలా విజయం సాధించిందని వారు విస్మయం వ్యక్తం చేశారు. బిల్‌గేట్స్‌ని కలిస్తే ఆయన ప్రత్యేకంగా అభినందించారు’ అని కేంద్రమంత్రి గుర్తు చేసుకున్నారు.

Rising India Summit: చట్టం అందరికీ సమానమే.. ఓబీసీలకు ఇంకా రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పలేదు: జైశంకర్

‘శివసేన మాతోనే ఉంది..ఉద్దవ్ సొంత పార్టీని విడిచిపెట్టాడు..’ రైజింగ్ ఇండియా సమ్మిట్‌లో పీయూష్ గోయల్

భేషుగ్గా ఉన్నాం..

భారత ప్రజాస్వామ్యం, భారతీయుల ఆరోగ్యం భేషుగ్గా ఉందని కేంద్రమంత్రి మన్‌సుఖ్ మాండవీయ చెప్పారు. ఎవరైనా బాగోలేదని చెబితే.. అది వారి తప్పిదమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రతి ఒక్క భారతీయుడు ఈ ప్రభుత్వం తనదే అనే విశ్వాసంతో ఉన్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇళ్లు, రేషన్, గ్యాస్ సిలిండర్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తోందని చెప్పారు. తన కోసమే ప్రభుత్వం పని చేస్తోందన్న భావన ప్రతి భారతీయుడిలో ఉందని ఆయన సగర్వంగా చెప్పుకొచ్చారు.

First published:

Tags: Heart Attack

ఉత్తమ కథలు