బిహార్‌లో 100కు చేరిన చిన్నారుల మరణాలు...మాట్లాడేందుకు ఆరోగ్య మంత్రి నిరాకరణ...

బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) బారినపడి మృతి చెందుతున్న చిన్నారుల సంఖ్య 100కు చేరింది.

news18-telugu
Updated: June 17, 2019, 4:11 PM IST
బిహార్‌లో 100కు చేరిన చిన్నారుల మరణాలు...మాట్లాడేందుకు ఆరోగ్య మంత్రి నిరాకరణ...
ఆస్పత్రిలో చిన్నారులు
news18-telugu
Updated: June 17, 2019, 4:11 PM IST
బిహార్‌లోని ముజఫర్‌పూర్ జిల్లాలో అక్యూట్ ఎన్‌సెఫలైటిస్ సిండ్రోమ్(ఏఈఎస్) బారిన పడి గత 16 రోజుల్లో మరణించిన చిన్నారుల సంఖ్య 100కు చేరింది. నిన్న(ఆదివారం) ఒక్క రోజే 20 మందికి పైగా చిన్నారులు మరణించారు. అధికారిక సమాచారం మేరకు శ్రీకృష్ణ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో 87 మంది చిన్నారులు మృతి చెందగా...కేజ్రివాల్ ఆస్పత్రిలో 17 మంది కన్నుమూశారు. చిన్నారుల మరణాలు రోజురోజుకూ పెరుగుతుండడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రుల్లో ఇంకా 300 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు. బిహార్‌లో పెరుగుతున్న చిన్నారుల మరణాలపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్థన్ నిరాకరించారు. బిహార్‌లో చిన్నారుల మరణాలు పెరుగుతుండడంపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా...బైట్ ఇవ్వలేనంటూ వెళ్లిపోయారు.

మంత్రి హర్షవర్ధన్ ఆదివారం ముజఫర్‌పూర్‌లోని ఆస్పత్రిని సందర్శించి, మృతుల కుటుంబాలతో కలిసి మాట్లాడారు. ఆ సమయంలో హర్షవర్ధన్ వెంట కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ చౌబే, బిహార్ ఆరోగ్య శాఖ మంత్రి మంగళ్ పాండేలు కూడా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, బాధిత కుటుంబాలకు కేంద్రం నుంచి పూర్తి సాయాన్ని అంజేస్తామని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు.

అటు బిహార్ సీఎం నితీశ్ కుమార్ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు. అటు వడగాల్పులతో బిహార్‌లో మృతుల సంఖ్య ఆదివారం ఒక్క రోజే 61 మంది మృతి చెందారు. వడగాల్పుల తీవ్రత ఔరంగాబాద్, నవడాలో ఎక్కువగా ఉంది.  ఎండల తీవ్రత దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలకు ఈ నెల 22 వరకు సెలవులు ప్రకటించారు.
Loading...

First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...