హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Union Budget 2022-23: రూ. 11.6 లక్షల కోట్ల అప్పు చేయనున్న కేంద్రం.. గతంతో పోల్చితే..

Union Budget 2022-23: రూ. 11.6 లక్షల కోట్ల అప్పు చేయనున్న కేంద్రం.. గతంతో పోల్చితే..

నిర్మలా సీతారామన్

నిర్మలా సీతారామన్

Loans in Budget: బడ్జెట్ ప్రసంగం ప్రకారం.. 2022-23లో ప్రభుత్వం తీసుకున్న మొత్తం మార్కెట్ రుణాలు రూ. 11 లక్షల 58 వేల 719 కోట్లుగా అంచనా వేశారు.

  కేంద్ర ప్రభుత్వం తమ ఖర్చులను తీర్చుకోవడానికి అప్పులు చేయాల్సి ఉంటుంది. తాజాగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఇందుకోసం ఏ మేరకు అప్పులు చేయాల్సి ఉంటుందనే దానిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కేంద్రం 2022-23 ఆర్థిక సంవత్సరంలో తన ఖర్చులను తీర్చడానికి మార్కెట్ నుండి దాదాపు రూ. 11.6 లక్షల కోట్ల రుణాన్ని తీసుకోనుంది. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనా రూ.9.7 లక్షల కోట్ల కంటే ఈ సంఖ్య దాదాపు రెండు లక్షల కోట్లు ఎక్కువ కావడం గమనార్హం. బడ్జెట్ ప్రసంగం ప్రకారం.. 2022-23లో ప్రభుత్వం తీసుకున్న మొత్తం మార్కెట్ రుణాలు రూ. 11 లక్షల 58 వేల 719 కోట్లుగా అంచనా వేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సవరించిన అప్పుల అంచనా రూ. 8 లక్షల 75 వేల 771 కోట్లు.

  అయితే బడ్జెట్ అంచనాలో రూ.9 లక్షల 67 వేల 708 కోట్లుగా అంచనా వేశారు. అయితే ఈ మొత్తం స్థూల రుణంలో గత రుణాల చెల్లింపు కూడా ఉంటుంది. ఇక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర బడ్జెట్ 20ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఇది మొత్తం పదో బడ్జెట్ కాగా.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు నాలుగో బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్ ద్వారా మోదీ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నించింది.

  బడ్జెట్‌లో రానున్న మూడేళ్లలో 400 వందేభారత్‌ రైళ్లు నడపాలని, డిజిటల్‌ యూనివర్సిటీలు, 16 లక్షల మంది యువతకు ఉద్యోగాలు, డిజిటల్‌ కరెన్సీ, రైతుల ఖాతాలో రూ. 2.37 లక్షల కోట్ల బదిలీ, రత్నాలు, ఆభరణాలపై పన్ను మినహాయింపు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 80 లక్షల ఇళ్ల నిర్మాణం, ఎలక్ట్రికల్ వాహనాల మార్కెట్‌ను ప్రోత్సహించాలని కేంద్రం ప్రకటించింది. అయితే ప్రభుత్వం దేశీయ మార్కెట్ నుంచి రుణాలు తీసుకునే విధానం సరైనదని ఆర్థిక నిపుణులు భావించడం లేదు.

  Budget 2022: ఆ ఉద్యోగులకు నిర్మలమ్మ శుభవార్త.. ట్యాక్స్ కటింగ్స్ తగ్గింపు

  Union Budget 2022: కేంద్ర బడ్జెట్‌లో అసలేముంది? ఈసారి కొత్తగా ఏం రాబోతున్నాయి?

  ప్రభుత్వ మార్కెట్ నుండి ఎక్కువ రుణాలు తీసుకోవడం ఆర్థిక వ్యవస్థకు మంచిది కాదన్నది వారి అభిప్రాయం. దీని వల్ల వడ్డీ రేటు పెరిగే అవకాశం ఉంటుందని.. ఇది కాకుండా పరిశ్రమ, వ్యాపారం కోసం వ్యవస్థలో తగినంత డబ్బు లేదన్నది వారి వాదన. వ్యవస్థలో వడ్డీ రేటు పెరుగుదల సాధారణ ఆదాయాన్ని కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ కారణంగా గృహ రుణం, కారు రుణాలు, వ్యక్తిగత రుణాలు కూడా మరింత ఖరీదువుతాయని భావిస్తున్నారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: Union Budget 2022

  ఉత్తమ కథలు