రంజాన్ మాస సమయంలో ముస్లిం సోదరులంతా ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. ఏడు లక్షల మసీదులు, ధార్మిక సంస్థల నేతలతో కలిసి పని చేయాలని వక్ఫ్ బోర్డులను కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఆదేశించారు. రంజాన్ మాసం సమీపిస్తున్న నేపథ్యంలో లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని నఖ్వీ తెలిపారు. ఈ రోజు అన్ని రాష్ట్రాల వక్ఫ్ బోర్డు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించిన కేంద్రమంత్రి నఖ్వీ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలను వారిని వివరించారు.
పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులంతా భారత్ సహా ప్రపంచమంతా కరోనా బారినుంచి విముక్తి పొందేలా ప్రార్థనలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. దయచేసి కరోనా బాధితుల కోసం పోరాటం చేస్తున్న హెల్త్ వర్కర్స్, డాక్టర్లు, పోలీసులకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఫేక్ న్యూస్‌లను నమ్మవద్దని కేంద్రమంత్రి సూచించారు. నిజాయితీగా వ్యక్తుల మధ్య దూరాన్ని పాటించేలా వక్ఫ్ బోర్డులకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని నఖ్వీ తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.