హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Amazon : ‘వాటి అమ్మకాలు ఆపేయండి’.. అమెజాన్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు..

Amazon : ‘వాటి అమ్మకాలు ఆపేయండి’.. అమెజాన్‌కు కేంద్ర ప్రభుత్వం నోటీసులు..

Amazon India

Amazon India

Amazon : ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్‌(Amazon)కు కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. వాటి విక్రయాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

సెప్టెంబర్ 4న ముంబై సమీపంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ (Cyrus Mistri) ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆయన మరణం తర్వాత రోడ్డు భద్రతా నియమాలు, వాహనాల సేఫ్టీ ఫీచర్లపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. సీటు బెల్ట్(Seat Belt) ప్రాముఖ్యత మళ్లీ తెరపైకి వచ్చింది. మిస్త్రీ ప్రమాదం జరిగిన సమయంలో వెనుక సీటులో సీటు బెల్ట్ ధరించకుండా ప్రయాణించినట్లు సమాచారం. అయితే ధరతో సంబంధం లేకుండా అన్ని కార్లపై డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లను తప్పనిసరి చేస్తూ ఇంతకు ముందే భారత ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. అయినా వీటిని అమలు చేయడంలో లోపాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్నాయి.కారులో ప్రయాణిస్తున్న అందరూ తప్పకుండా సీటు బెల్ట్ ధరించాలని, ఈ నిబంధనలు కఠినంగా అమలు చేయాలని, ఉల్లంఘించిన వారికి జరిమానా విధించాలని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ చెప్పారు. ఈ క్రమంలోనే ఆన్‌లైన్ రిటైల్ దిగ్గజం అమెజాన్‌(Amazon)కు కేంద్ర ప్రభుత్వం ఒక లేఖ రాసింది. సీట్ బెల్ట్ అలారమ్స్‌ను అడ్డుకునే డివైజ్‌(Seat Belt Alarm Stoppers)ల విక్రయాలను నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం(Central Government) కోరింది.
* అమెజాన్‌కు నోటీసులు
కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాయిటర్స్‌తో మాట్లాడుతూ.. కారు సీటు బెల్ట్‌ ధరించని సమయంలో వచ్చే అలారంను అడ్డుకొనే డివైజ్‌ల అమ్మకాన్ని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భద్రతా ప్రమాణాల దృష్ట్యా ఈ చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేశారు.


అమెజాన్‌లో అందుబాటులో ఉన్న మెటా క్లిప్‌లు సీట్ బెల్ట్ స్లాట్‌లలో చొప్పిస్తారని, ఇది సాధారణంగా కారు నడుపుతున్నప్పుడు సీటు ‌బెల్ట్‌లు ఉపయోగించనప్పుడు వచ్చే అలారం‌ను అడ్డుకుంటాయని చెప్పారు. సీటు బెల్ట్ ధరించకుండా ఉండటానికి ప్రజలు ఈ క్లిప్‌లను కొనుగోలు చేస్తారని గడ్కరీ తెలిపారు. వీటిని విక్రయించడాన్ని నిలిపివేయాలని అమెజాన్‌కు నోటీసు పంపామని చెప్పారు.
ఇది కూడా చదవండి :  పిక్సెల్ 7 ఫోన్, గూగుల్ స్మార్ట్‌వాచ్ లాంచ్‌ కి ముహుర్తం ఫిక్స్.. కొత్త ప్రొడక్ట్స్ ఫీచర్లు, డిజైన్ వివరాలివే..


* సీట్‌ బెల్టు బీపర్లు తప్పనిసరి?
ప్రయాణీకులందరికీ సీటు బెల్టులు తప్పనిసరి అని, నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానా విధిస్తామని సెప్టెంబరు 6న నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. వెనుక వైపు సీటు బెల్టుల కోసం కూడా ప్రభుత్వం బీపర్లను తప్పనిసరి చేస్తుందని మంత్రి తెలిపారు. గడ్కరీ వ్యాఖ్యల నేపథ్యంలో ఓ సీనియర్‌ మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రకాల సీట్ బెల్ట్ అలారం స్టాపర్లను నిషేధించాలని కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు.
భారతదేశంలో కారులో ప్రయాణిస్తున్న వారు అందరూ సీటు బెల్టులు ధరించకపోతే ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధించే అధికారం ఉంది. అయితే ఇప్పటి వరకు ఈ నిబంధనను సక్రమంగా అమలు చేయలేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు రోడ్ సేఫ్టీ, వాహనాల సేప్టీ ఫీచర్లపై కేంద్రం కఠిన నిర్ణయాలు తీసుకుంటుండటం శుభపరిణామమని వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Amazon, Car accident, Central Government

ఉత్తమ కథలు