హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Farmers Protest: ఇదేం పద్ధతి.. ఆ సెలబ్రిటీల తీరుపై కేంద్రం ఆగ్రహం

Farmers Protest: ఇదేం పద్ధతి.. ఆ సెలబ్రిటీల తీరుపై కేంద్రం ఆగ్రహం

ఫ్రతీకాత్మక చిత్రం

ఫ్రతీకాత్మక చిత్రం

Farmers Protest: ఇది దేశంలోని ఓ ప్రాంతంలో కొద్ది మంది రైతులు మాత్రమే చేస్తున్న ఆందోళన అని పేర్కొంది. ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని... ఇలాంటి వాటిపై స్పందించే సమయంలో వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపట్టిన ఆందోళనలు కొన్ని నెలల నుంచి కొనసాగుతున్నాయి. ఈ ఆందోళనలకు పలువురు సెలబ్రిటీలు సైతం మద్దతు తెలిపారు. అయితే కొందరు విదేశీ సెలబ్రిటీలు రైతుల ఆందోళనపై ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ రకమైన ట్వీట్లను కేంద్రం తప్పుబట్టింది. ఆందోళనపై ట్వీట్లు చేస్తున్న అంతర్జాతీయ సెలబ్రిటీలపై మండిపడింది. ఇది సరైనది కాదని, బాధ్యతారాహిత్యమని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. రైతుల ఆందోళనలపై ప్రముఖ సింగర్ రిహానా, యాక్టివిస్ట్ గ్రెటా థన్‌బర్గ్‌, అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మేనకోడలు, లాయర్ మీనా హారిస్ ట్వీట్లు చేశారు. దీంతో కేంద్రం దీనిపై స్పందించింది.

ఈ ట్వీట్లపై విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్ అయింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇది దేశంలోని ఓ ప్రాంతంలో కొద్ది మంది రైతులు మాత్రమే చేస్తున్న ఆందోళన అని పేర్కొంది. ఇది పూర్తిగా భారతదేశ అంతర్గత వ్యవహారమని... ఇలాంటి వాటిపై స్పందించే సమయంలో వాస్తవాలు తెలుసుకోవాలని సూచించింది. వీటిని అంతా అర్థం చేసుకోవాలని స్పష్టం చేసింది. ఇలాంటి అంశాలపై సెలబ్రిటీల సెన్సేషనలిస్ట్ సోషల్ మీడియా హ్యాష్‌ట్యాగ్‌లు, కామెంట్లు సరికావని సూచించింది.

ఇలాంటి చర్యలకు పాల్పడేవారిది బాధ్యతా రాహిత్యం అని గట్టిగా వ్యాఖ్యానించింది. రైతుల్లోని కొన్ని స్వార్థపరమైన గ్రూపులు తమ ఎజెండాను ఈ ఆందోళనలకు ఆపాదించే ప్రయత్నాలు చేస్తున్నాయని.. ఈ గ్రూపులే ఇండియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ మద్దతు కూడగడుతున్నాయని విదేశాంగ శాఖ ప్రకటనలో తెలిపింది. అలాంటి వాళ్ల వల్లే కొన్ని దేశాల్లో మహాత్మా గాంధీ విగ్రహాల ధ్వంసం జరుగుతోందని పేర్కొంది. ఇది ఇండియాను చాలా బాధించిందని స్పష్టం చేసింది.

First published:

Tags: Delhi, Farmers Protest

ఉత్తమ కథలు