హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Helicopter Crash: బిపిన్ రావత్ ఇంటికి చేరుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అందరిలోనూ ఉత్కంఠ

Helicopter Crash: బిపిన్ రావత్ ఇంటికి చేరుకున్న రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్.. అందరిలోనూ ఉత్కంఠ

బిపిన్ రావత్ ఇంటికి చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్ (Image: ANI)

బిపిన్ రావత్ ఇంటికి చేరుకున్న రాజ్‌నాథ్ సింగ్ (Image: ANI)

Helicopter Crash: ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన బిపిన్ రావత్ నివాసానికి చేరుకోవడంతో అసలేం జరుగుతోందనే అంశంపై ఉత్కంఠ మరింతగా పెరిగింది.

చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్, ఆయన భార్య సహా 12 మంది ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురికావడం సంచలనం సృష్టించింది. ఈ ప్రమాదంలో మొత్తం 11 మంది చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. అయితే సీడీఎస్ బిపిన్ రావత్, ఆయన భార్య మధులిక పరిస్థితి ఏంటనే దానిపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఘటనపై సమాచారం వచ్చిన వెంటనే కేంద్ర కేబినెట్ అత్యవసరంగా సమావేశమైంది. పరిస్థితిని ప్రధాని మోదీకి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరించారు. అనంతరం ఆయన ఢిల్లీలోని బిపిన్ రావత్ నివాసానికి చేరుకున్నారు. అంతకముందు ప్రమాద జరిగిన ప్రాంతానికి వెళ్లాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ వీఆర్ చౌదరిని ఆదేశించారు. దీంతో ఆయన హుటాహుటిన ప్రమాదం జరిగిన తమిళనాడులోని కూనురు ప్రాంతానికి బయలుదేరారు. ఈ ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే ఆయన బిపిన్ రావత్ నివాసానికి చేరుకోవడంతో అసలేం జరుగుతోందనే అంశంపై ఉత్కంఠ మరింతగా పెరిగింది.

అంతకుముందు తమిళనాడులో హెలికాప్టర్ ప్రమాదం జరగడంతో ఆర్మీ అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కూనూరులో ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో సీడీఎస్ బిపిన్ రావత్ (CDS Bipin rawat) తో పాటు పలువురు ఆర్మీ ఉన్నతాధికారులు ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఆర్మీకి చెందిన MI-17 V5 విమానం... నీలగిరి జిల్లా కూనూర్ సమీపంలోని అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఢిల్లీ నుంచి ఊటీలోని ఓ డిఫెన్స్ కాలేజీకి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం హెలికాప్టర్‌లో 9 మంది ఉన్నట్లు తెలిసింది. అయితే అనంతరం అందులో 14 మంది ఉన్నట్టు ధృవీకరించారు.

హెలికాప్టర్‌‌లో ఉన్న పలువురి వివరాలు.

1. బిపిన్ రావత్, సీడీఎస్

2. మధులికా రావత్, DWWA అధ్యక్షురాలు, బిపిన్ రావత్ సతీమణి

3. ఎల్.ఎస్. సిద్దర్, బ్రిగేడియర్

4. హర్జిందర్ సింగ్, లెఫ్టినెంట్ కల్నల్

5. గురుసేవక్ సింగ్, నాయక్

6. జితేంద్ర కుమార్, నాయక్

7. వివేక్ కుమార్, లాన్స్ నాయక్

8. బి. సాయి తేజ, లాన్స్ నాయక్

9. సత్‌పాల్, హవిల్దార్.

Tamilnadu helicopter crash: హెలికాప్టర్‌ ప్రమాదంలో ఐదుగురు మృతి.. అందులో ఉన్న వారి వివరాలు ఇవే

Tamilnadu: తమిళనాడులో ఘోర హెలికాప్టర్ ప్రమాదం.. చాపర్‌లో CDS బిపిన్ రావత్ ఫ్యామిలీ

హెలికాప్టర్ కూలిన వెంటనే పెద్ద ఎత్తునమంటలు చెలరేగాయి. ఆ మంటలను చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. విమానంలో సీడీఎస్ బిపిన్ రావత్‌తో పాటు మొత్తం 9 మంది ప్రయాణికులు ఉండగా.. ఇప్పటి వరకు ఏడుగురి మృతదేహాలు లభ్యమయినట్లు తెలుస్తోంది. ఐతే ఆ మృతదేహాలు ఎవరివి అనే వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలు పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉండడంతో వారు ఎవరన్నది గుర్తు పట్టడం కష్టంగా మారింది. మృతదేహాలను వెల్లింగ్టన్‌లోని మిలటరీ ఆస్పత్రికి తరలించినట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. ఐతే హెలికాప్టర్‌లో ఉన్న బిపిన్ రావత్ పరిస్థితి ఏంటన్నది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంపై ప్రధాని మోదీ ఆర్మీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

First published:

Tags: Bipin Rawat, Helicopter Crash, Rajnath Singh

ఉత్తమ కథలు