ఎయిర్ ఇండియా అమ్మకంపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ను వచ్చే సంవత్సరం మార్చిలోగా విక్రయిస్తామని కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.

news18-telugu
Updated: November 17, 2019, 3:36 PM IST
ఎయిర్ ఇండియా అమ్మకంపై ఆర్థిక మంత్రి కీలక వ్యాఖ్యలు
(ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రస్తుతం రూ. 58 వేల కోట్ల అప్పుల్లో ఉందని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎయిర్ ఇండియా, భారత్ పెట్రోలియం కార్పొరేషన్‌ను వచ్చే సంవత్సరం మార్చిలోగా విక్రయిస్తామని ఆమె వ్యాఖ్యానించారు. రెండు కంపెనీల విక్రయం ఈ ఆర్థిక సంవత్సరమే పూర్తి చేయాలని భావిస్తున్నామని స్పష్టం చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అనుసరించి తుది నిర్ణయం ఉంటుందని ఆమె ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఇదిలా ఉంటే ఎయిర్ ఇండియా సంస్థ చైర్మన్ అశ్వని లోహానీ ఉద్యోగులకు బహిరంగ లేఖ రాశారు.

ప్రభుత్వ వాటాల ఉపసంహరణ తరువాత సంస్థ నిలదొక్కుకుంటుందన్న భరోసాను ఇచ్చారు. ఇదే విషయాన్ని ప్రస్తావించిన నిర్మలా సీతారామన్, ఎయిర్ ఇండియాలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తిని చూపుతున్నారని తెలిపారు.. ఇటీవల నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ సమావేశంలో ఎయిర్ ఇండియా సహా, పలు కంపెనీల్లో డిజిన్వెస్ట్ మెంట్ కు సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపింది. ఎయిర్ ఇండియాలో 76 శాతం వాటాలను విక్రయించాలని ప్రభుత్వం భావిస్తోంది.






First published: November 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...