హోమ్ /వార్తలు /జాతీయం /

భారత్‌కు సపోర్ట్‌గా అమెరికా... పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి

భారత్‌కు సపోర్ట్‌గా అమెరికా... పాకిస్థాన్‌పై మరింత ఒత్తిడి

సరిహద్దుల్లో భారత దళాల గస్తీ (Image : ANI)

సరిహద్దుల్లో భారత దళాల గస్తీ (Image : ANI)

India Vs Pakistan : ఉగ్రవాద శిబిరాలపై చర్యలు తీసుకునేలా పాకిస్థాన్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి కొనసాగుతోంది.

పాకిస్థాన్ సైన్యం అదుపులో ఉన్న వింగ్ కమాండర్ అభినందన్‌ను సురక్షితంగా విడిచిపెట్టాలని పాకిస్థాన్‌ విదేశాంగ వ్యవహారాల శాఖను అక్కడి భారత రాయబారి కోరారు. భారత్‌లోని పాకిస్థాన్ రాయబారికి కూడా కేంద్ర విదేశాంగ శాఖ ఇదే సందేశాన్ని ఇచ్చిందని ANI వార్తా సంస్థ తెలిపింది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, అమెరికా విదేశాంగ శాఖ సహాయమంత్రి మైక్ పాంపియో మధ్య బుధవారం రాత్రి టెలిఫోన్ సంభాషణ జరిగినట్లు తెలిసింది. పాకిస్థాన్ సరిహద్దుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ శిబిరాల్ని భారత వైమానిక దళం నేలమట్టం చేసిన అంశంపై భారత్‌కు పూర్తి మద్దతు ఇస్తామని పాంపియో చెప్పినట్లుగా ANI వార్తా సంస్థ తెలిపింది.


మరోవైపు గురువారం లోక్ కల్యాణ్ మార్గ్‌లో కేంద్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశంలో భారత్ పాకిస్థాన్ ప్రస్తుత పరిణామాలు, వింగ్ కమాండర్ అభినందన్ విడుదల, పాకిస్థాన్‌పై అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి తేవడం, పాకిస్థాన్‌కి వ్యతిరేకంగా అంతర్జాతీయ దేశాల మద్దతు కూడగట్టడం, ఉగ్రవాదంపై పాకిస్థాన్ పూర్తిస్థాయిలో చర్యలు తీసుకునే అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.


 

ఇవి కూడా చదవండి :


మొబైల్ నెట్‌వర్క్ మారాలా? జస్ట్ గంటలో పనైపోతుంది... ఇలా చెయ్యండి


మీ మొబైల్ లో యాప్స్‌ డైరెక్టుగా ఎవరికైనా పంపాలా... సింపుల్... ఇలా చెయ్యండి


వాట్సాప్ సీక్రెట్ ట్రిక్... అవతలి వాళ్లకు తెలియకుండా వాళ్ల స్టేటస్ చూడటం ఎలా?

First published:

Tags: India VS Pakistan, Jammu and Kashmir, Pulwama Terror Attack

ఉత్తమ కథలు