UNION CABINET MEETING HEADED BY PM NARENDRA MODI WILL BE HELD TODAY AK
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ..
ప్రధాని మోదీ(ఫైల్ ఫోటో)
రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా వలస కూలీలు, వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు కీలకమైన సంస్కరణలను తీసుకొచ్చింది కేంద్రం.
ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. ఉదయం 11 గంటలకు ఈ భేటీ మొదలుకానుంది. లాక్ డౌన్ పరిస్థితులు, కరోనా వ్యాప్తి వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అంఫాన్ తుఫాన్‌పై కూడా కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది. లాక్డౌన్ 4.0ను ఈ నెలాఖరు వరకు పొడిగించిన కేంద్రం... లాక్డౌన్ మినహాయింపుల అంశాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేసింది. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు రూ. 20 లక్షల కోట్ల ప్యాకేజీని ప్రకటించిన కేంద్రం... దేశంలోని అనేక రంగాలకు ఊతమిచ్చే చర్యలు తీసుకుంది.
వలస కూలీలు, వ్యవసాయం, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఊరట కలిగించే నిర్ణయాలతో పాటు కీలకమైన సంస్కరణలు తీసుకుంది. కేంద్రం తీసుకున్న ప్యాకేజీపై వివిధ రాష్ట్రాలు అసంతృప్తి వ్యక్తం చేయగా... మరికొన్ని రాష్ట్రాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై వస్తున్న ఫీడ్ బ్యాక్‌పై కూడా కేంద్ర కేబినెట్లో చర్చ జరగనుంది. మరోవైపు ప్యాకేజీలో భాగంగా అనేక రంగాలకు ఊతమిచ్చిన కేంద్రం... ఈ సమావేశంలో మరిన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకోవచ్చని తెలుస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.