Home /News /national /

UNION CABINET CLEARS RS 1500 CR FOR IREDA SAFAI KARAMCHARI COMMISSION EXTENSION INTEREST EX GRATIA MKS

Union Cabinet Decisions : కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు: పూర్తి వివరాలివే

సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్

సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్

కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన అంశాలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. సఫాయీ కర్మచారీల జాతీయ కమిషన్ గడువును మరో మూడేళ్లకు పెంచారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఢిల్లీలో సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఎనర్జీ, బ్యాంకింగ్ రంగాలకు సంబంధించిన అంశాలకు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదముద్ర వేసింది. మరికొద్ది రోజుల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న దరిమిలా ఈ నిర్ణయాలకు ప్రాధాన్యం ఏర్పడింది. బ్యాంకులు లేదా రుణ సంస్థలకు వడ్డీపై వడ్డీ ఎక్స్ గ్రేషియా ఆమోదంతోపాటు పునరుత్పాదక ఇంధన రంగానికి భారీ రుణ సౌకర్యం పొందే వెసులుబాటు కల్పించారు. సఫాయి కర్మచారీల జాతీయ కమిషన్ గడువును మరో మూడేళ్లకు పెంచారు. కేబినెట్ నిర్ణయాలను కేంద్ర సమాచార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ మీడియాకు వెల్లడించారు. వాటికి సంబంధించిన వివరాలివే..

IREDA బలోపేతానికి రూ. 1,500 కోట్లు
సంప్రదాయ ఇదన వనరులపై ఆధారపడటం క్రమంగా తగ్గించుకుంటూ, ప్రత్యామ్నాయ వ్యవస్థలను బలోపేతం చేసుకోవాలనే విధాన నిర్ణయాన్ని అనుసరిస్తూ, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఐఆర్ఈడీఏ)లో రూ.1500 కోట్ల ఈక్విటీ ఇన్‌ఫ్యూషన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పునరుత్పాదక ఇంధన రంగం రూ.12,000 కోట్ల రుణం పొందడానికి ఈ నిర్ణయం తోడ్పాటునిస్తుంది. దీంతో (ఐఆర్ఈడీఏ) ఏజెన్సీ నికర విలువ, వృద్ది పెరుగుతాయని, సుమారు 10,200 కొత్త ఉద్యోగాలు వస్తాయని, అదే సమయంంలో ఏడాదికి 7.49 మిలియన్ టన్నుల  కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాల తగ్గింపు సాధ్యమవుతుందని,  ఐఆర్ఈడీఏ క్యాపిటల్-టు-రిస్క్ వెయిటెడ్ అసెట్స్ రేషియో (CRAR) మెగురుపడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Debit Card: అమ్మాయి చేసిన పనికి ఏటీఎం కార్డుతో గొంతు కోసుకున్నాడు.. అసలేం జరిగిందో తెలిస్తే షాకవుతారు!



వడ్డీపై వడ్డీ కోసం ఎస్పీఐకి రూ. 973.74 కోట్లు
కరోనా విలయం, లాక్ డౌన్ల నేపథ్యంలో చిన్న రుణగ్రహీతలను ఆదుకునే ఉద్దేశంతో, బ్యాంకులకు చక్రవడ్డీ, సాధారణ వడ్డీ మధ్య వ్యత్యాసానికి ప్రభుత్వమే ఎక్స్-గ్రేషియాగా చెల్లిస్తున్న సంగతి తెలిసిందే. గ్రహీతకు బ్యాంకులు రుణం ఇచ్చేందుకు వీలుగా 'వడ్డీపై వడ్డీ' కోసం రూ. 973.74 కోట్ల ఎక్స్‌గ్రేషియా చెల్లింపును ప్రభుత్వం ఆమోదించింది.

Shocking: నాలుగు చేతులు, నాలుగు కాళ్లతో వింత శిశువు జననం.. భగవంతుడి అవతరమంటూ..



జాతీయ కమిషన్ గడువు పెంపు
సఫాయి కర్మచారుల జాతీయ కమిషన్ పదవీకాలాన్ని మరో మూడేళ్లకు పెంచుతూ కేంద కేబినెట్ నిర్ణయం తీసుకుంది. కమిషన్ గడువు మార్చి 31తో ముగుస్తున్నందున ఆ తేదీ తర్వాత దానిని మరో మూడేళ్లు కొనసాగించేందకు వీలుంటుంది. ఇందుకుగానూ రూ.43.68కోట్ల ఖర్చవుతుందని సర్కారు పేర్కొంది. సఫాయి కరంచారిలు, గుర్తింపుపొందిన మాన్యువల్ స్కావెంజర్లు దీని ద్వారా లబ్దిపొందుతారని, 2021 డిసెంబర్ 31 నాటికి దేశంలో గుర్తిపు పొందిన స్కావెంజర్ల సంఖ్య 58,098గా ఉందని ప్రభుత్వం పేర్కొంది.
Published by:Madhu Kota
First published:

Tags: Union Budget 2022, Union cabinet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు