UNION CABINET CHAIRED BY PM MODI HAS APPROVES FARM LAWS REPEAL BILL 2021 TO BE TABLED IN PARLIAMENT IN WINTER SESSION MKS
pm modi : సాగు చట్టాల రద్దు బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం -MSP చట్టం సంగతేంటి?
ప్రధాని మోదీ(పాత ఫొటో)
కేంద్ర వ్యవసాయ శాఖ, ప్రధాని కార్యాలయం(పీఎంవో)తో సంప్రదింపులు జరిపి రూపొందించిన సాగు చట్టాల రద్దు బిల్లు (Farm Laws Repeal Bill 2021)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ అధ్యతన ఇవాళ జరిగిన కేబినెట్ మీటింగ్ లో..
వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలంటూ తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలు(Farm Laws) ను రద్దు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనకు అనుగుణంగా కేంద్ర కేబినెట్ మంగళవారం నాడు సాగు చట్టాల రద్దు బిల్లుకు ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ (PM Modi) అధ్యక్షతన ఇవాళ ఢిల్లీలో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈనెల 29 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నందున పలు బిల్లులు, నిర్ణయాలకు కేంద్ర కేబినెట్ ఇవాళ ఆమోదం తెలిపింది. కేంద్ర వ్యవసాయ శాఖ, ప్రధాని కార్యాలయం(పీఎంవో)తో సంప్రదింపులు జరిపి రూపొందించిన సాగు చట్టాల రద్దు బిల్లు (Farm Laws Repeal Bill 2021)కు కొద్ది సేపటి కిందటే కేంద్ర మంత్రివర్గం ఆమోదం లభించింది.
సాగు చట్టాల రద్దు బిల్లు-2021 ద్వారా గత ఏడాది పార్లమెంటులో చేసిన మూడు చట్టాలు.. 1)నిత్యవసర సరకుల(సవరణ) బిల్లు (ది ఎసెన్షియల్ కమోడిటీస్(అమెండమెంట్) బిల్ 2020), 2) 'రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార(ప్రోత్సాహక, సులభతర) బిల్లు' (ది ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్(ప్రమోషన్, ఫెసిలిటేషన్) బిల్), 3) 'రైతుల (సాధికారత, రక్షణ) ధర హామీ, సేవల ఒప్పంద బిల్లు-2020(ది ఫార్మర్స్ (ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్) అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ బిల్ - 2020) రద్దుకానున్నాయి. ఈనెల 29 నుంచి జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే సాగు చట్టాల రద్దు బిల్లును ప్రభుత్వం ఉభయసభల్లో ప్రవేశపెట్టనుంది. అయితే,
మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటన చేయడం, ఇప్పుుడు కేంద్ర కేబినెట్ సైతం రద్దుకు ఆమోదం తెలిపినా, రైతు సంఘాలు మాత్రం నిరసనలు కొనసాగిస్తూనే ఉన్నాయి. సాగు చట్టాల రద్దుతోపాటు ఆరు డిమాండ్లను కేంద్రం ముందు ఉంచామని, వాటిలో ప్రధానమైనది పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పన అని, రైతులకు కచ్చితంగా ఎంఎస్పీ దక్కేలా కేంద్రం చట్టం చేసేదాకా ఉద్యమాన్ని కొనసాగిస్తామని 40 రైతు సంఘాల సమాఖ్య సంయుక్త్ కిసాన్ మోర్ఛా ఇదివరకే స్పష్టం చేసింది. కాగా, బుధవారం నాటి కేబినెట్ భేటీలో ఎంఎస్పీ అంశంపై స్పష్టమైన నిర్ణయమేదీ తీసుకోనట్లు తెలుస్తోంది.
సాగు చట్టాల రద్దుతోపాటు భారత్ లో క్రిప్టో కరెన్సీ చట్టబద్దతపైనా కేంద్ర కేబినెట్ చర్చించింది. ఇప్పటి వరకు అందుతోన్న సమాచారాన్ని బట్టి.. ఇండియాలో క్రిప్టో కరెన్సీని రద్దు చేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంలేదని, అయితే క్రిప్టో లావాదేవీలపై కీలక నిబంధనలు జారీ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.