Home /News /national /

UNION CABINET APPROVES NATIONAL LAND MONETISATION CORPORATION THE NEXT BIG REFORM OF MODI GOVT DETAILS HERE MKS

Land Monetisation: ప్రభుత్వ భూములు, ఆస్తులు అమ్మకం ఇంకా వేగంగా -NLMCకి కేంద్ర కేబినెట్ ఆమోదం

ప్రధాని మోదీ

ప్రధాని మోదీ

ప్రభుత్వ సంస్థల భూములు, ఆస్తుల అమ్మకాన్ని మరింత జోరుగా కొనసాగించనుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (NLMC) ఏర్పాటుకు ఆమోదముద్రవేసింది.

ప్రైవేటైజేషన్, మానిటైజేషన్ ప్రక్రియను జెడ్ స్పీడు వేగంతో అమలు చేస్తోన్న మోదీ సర్కారు.. ప్రభుత్వ సంస్థల భూములు, ఆస్తుల అమ్మకాన్ని మరింత జోరుగా కొనసాగించనుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం కేంద్ర కేబినెట్ సమావేశాం జరిగింది. నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ (National Land Monetisation Corporation) ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదముద్రవేసింది. ఈ కార్పొరేషన్ ప్రభుత్వానికి అనుబంధ సంస్థగా పని చేయనుంది. రూ.5 వేల కోట్ల ఇనీషియల్‌ ఆథరైజ్డ్‌ షేర్‌ క్యాపిటల్‌తోపాటు రూ.150 కోట్ల పెయిడ్ అప్ షేర్‌ క్యాపిటల్‌తో ఇది ఏర్పాటు కానుంది.

మిగులు భూమి, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల భవన ఆస్తులను ఎన్‌ఎల్‌ఎంసీ (NLMC) మోనటైజేషన్ చేస్తుంది. విక్రయించబోయే లేదా మూసివేతకు సిద్దంగా ఉన్న ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ ఏజెన్సీల మిగులు భూములు, భవనాలను మానిటైజ్ చేసేందుకుగాను... ‘నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్(ఎన్‌ఎల్‌ఎంసీ)’ ఏర్పాటు కానుంది. మిగులు భూములు, సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్(సీపీఎస్‌ఈ)లు, ఇతర ప్రభుత్వ ఏజెన్సీల భవన నిర్మాణ ఆస్తులను మోనటైజేషన్ చేయనుంది.

Telangana ముందస్తు ఎన్నికలు! CM KCR హ్యాట్రిక్ కొట్టినట్టే.. ఉద్యోగాల ప్రకటన తర్వాత Owaisi వ్యాఖ్యలు


కేంద్ర ప్రభుత్వ సంస్థలు లేదంటే ప్రభుత్వ ఏజెన్సీలకు చెందిన మిగులు భూములు, భవనాలను ఎన్ఎల్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వీటి విక్రయం లేదంటే లీజ్‌కు ఇవ్వడం, లేదా ఉపయోగించుకోవడం, ఇి కూడా కాకపోతే మార్కెట్ నుంచి నిధుల సమీకరణ వంటి వాటిని ఈ సంస్థ చూసుకుంటుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2021-22 బడ్జెట్‌లో ఈ కంపెనీ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు. నాన్-కోర్ ఆస్తులను అంటే ఉపయోగించకుండా నిరుపయోగంగా ఉన్న ఆస్తులను మానిటైజ్ చేయడం ద్వారా ప్రభుత్వానికి గణనీయమైన ఆదాయం లభించనుంది.

CM KCR: ఇక నిరుద్యోగ భృతి లేనట్టేనా? -జాబ్ క్యాలెండర్‌లో మతలబు? -నమోదైన నిరుద్యోగులే 25 లక్షలు!


ప్రభుత్వ రంగ సంస్థల వద్ద నుంచి కొత్తగా ఏర్పాటు కాబోతున్న నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ సంస్థకు 3,400 ఎకరాలు లభించనున్నాయని తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, బీఆండ్ఆర్, బీపీసీఎల్, బీఈఎంఎల్, హెచ్ఎంటీ వంటి పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి ఈ ఆస్తులు ఇకపై కొత్త కంపెనీ చేతుల్లోకి వెళ్లనున్నాయి. కొత్త కంపెనీ ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులకు అసెట్ మేనేజర్‌గా వ్యవహరించనుంది.
Published by:Madhu Kota
First published:

Tags: Pm modi, Union cabinet

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు